ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం: ‘ఏ స్వీట్ రైవల్రీ’ ఆకట్టుకుంటున్న కాన్సెప్ట్ పోస్టర్!

పబ్లిక్ టాక్ టీవీ :ఫిలిం న్యూస్:

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వైవిధ్యభరితమైన కథాంశంతో ‘ఆత్రేయపురం బ్రదర్స్’ చిత్రం పట్టాలెక్కింది. రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.

ప్రముఖుల సందడి

ఈ ప్రారంభోత్సవ వేడుకకు దర్శకులు వశిష్ట, అనుదీప్ కె.వి, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ట క్లాప్ కొట్టగా, విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ అందించగా.. తొలి సన్నివేశానికి దర్శకుడు అనుదీప్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఆసక్తికరంగా కాన్సెప్ట్ పోస్టర్

సినిమా ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘ఏ స్వీట్ రైవల్రీ’ (A Sweet Rivalry) అనే ట్యాగ్ లైన్ తో, ఇద్దరు వ్యక్తులు బలపరీక్ష చేసుకుంటున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే భిన్నంగా, సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

తారాగణం – సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రైటర్, దర్శకత్వం: రాజేష్ జగన్నాధం
బ్యానర్స్: S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్
నిర్మాతలు: VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె

ఛాయాగ్రహణం: రమీజ్ నవనీత్.
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అనిల్ పసల
పీఆర్వో: సాయి సతీష్

అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *