హనుమాన్ జయంతి వేళ మెగాస్టార్ ఇంట్లో అద్భుతం: ఆంజనేయుడిపై సూర్య కిరణాల అభిషేకం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన ఇంటి పూజా మందిరంలో చోటుచేసుకున్న ఈ అపురూప దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.సూర్య కిరణాల సుప్రభాతంచిరంజీవి గారు షేర్ చేసిన వీడియోలో, ఆయన పూజా మందిరంలోని హనుమంతుడి విగ్రహంపై సూర్యోదయ వేళ తొలి కిరణాలు నేరుగా పడుతున్నాయి. స్వామివారి విగ్రహం…




