పీఠాధిపతి–మఠాధిపతి అంశంపై శ్రీకృష్ణమాచార్య స్వామి స్పష్టీకరణ

కడప, బ్రహ్మం గారి మఠం. అక్టోబర్ 17 : పబ్లిక్ టాక్ టీవి

భవిష్యత్ పీఠాధిపతి ఎంపికపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో శ్రీ బ్రహ్మపథం పీఠాధిపతి శ్రీకృష్ణమాచార్య స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు.

జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి యొక్క కంది మల్లయ్య పల్లె పుర సంస్థానం శ్రీ బ్రహ్మం గారి మఠం మఠాధిపతి అంశానికి సంబంధించినటువంటి విషయాలు గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఇదే అక్టోబర్ మాసం 28వ తారీఖున విశేషవంతమైనటువంటి సమావేశం ఉంది. ఈ సమావేశంలో ధార్మిక పరిషత్ అవ్వచ్చు,,, స్వామి వారి యొక్క శిష్యపరంపర కావొచ్చు, అందరూ కూడా సంఘటితమై ,సమావేశమై తదుపరి మఠాధిపతి ఎవరు అనేటువంటి అంశం గురించి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణం. ఈ తరుణంలో నిన్నటి రోజు శ్రీ కందిమల్లయ్య పల్లె శ్రీ బ్రహ్మం గారి మఠానికి సంబంధించినటువంటి భవిష్యత్తు మఠాధిపతి ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తుకు సంబంధించినటువంటి శ్రీనివాసానందస్వామి వారి మరియు ఆయనకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఒక ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాన్ని చూసాము. విస్మయానికి గురిచేసిందని బ్రహ్మపథం పీఠాధిపతి శ్రీకృష్ణమాచార్య స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

పీఠానికి, మఠానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు కూడా భవిష్య మఠాధిపతి ఎంపిక గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించిందని బ్రహ్మపథం శ్రీకృష్ణమాచార్య అన్నారు.మఠం లో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏంటో తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి సాంప్రదాయానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు చేసిఅన్నారు అనుచితమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.

ఈ విషయంలో ఎవరి ప్రమేయం అవసరం లేదని,, ధార్మిక పరిషత్ చూసుకుంటుంది లేదా కుటుంబపరమైనటువంటి అంశం అయితే ఆయా వ్యక్తులు చూసుకుంటారని స్పష్టం చేశారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలవల్ల భక్తుల , ప్రజల మనోభావాలు దెబ్బతీస్తాయని . విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను చెబుతున్నది ఇదేనని గురూజీ కృష్ణమాచార్య అన్నారు.

ప్రెస్‌క్లబ్‌లో శ్రీనివాసుల స్వాముల చేసిన వ్యాఖ్యలు భక్తులలో గందరగోళం సృష్టించాయని ఆయన తెలిపారు. మఠాధిపతి మరియు పీఠాధిపతి మధ్య తేడా తెలియకుండానే కొంతమంది మాట్లాడటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

“మఠంలోని సాంప్రదాయాలు ఎనిమిది తరాలుగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 మంది పీఠాధిపతులు సేవచేశారు. భవిష్యత్ పీఠాధిపతి ఎంపికలో ట్విస్టులు ఉన్నా, ఆ నిర్ణయం గురుదేవుల ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది” అని శ్రీకృష్ణమాచార్య స్వామి స్పష్టం చేశారు.

మారుతీ మహాలక్ష్మి గారు ఫిట్ పర్సన్ అంశంపై కోర్టుకు ఐదు సార్లు వెళ్లారన్నది అవాస్తవమని, ఒక్కసారి మాత్రమే వెళ్లారని ఆయన వివరించారు. ఆమె కుమారుడు గోవిందస్వామిని మఠాధిపతిగా నియమించుకోవాలనే ప్రయత్నం చేశారని అన్నారు.

“వీరబ్రహ్మేంద్ర స్వామి మహాత్ముడు భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాని. ఆయన మఠంలో పీఠాధిపతి ఎవరో ముందే నిర్ణయించబడింది. దానిపై వ్యాఖ్యానించడం మీ అజ్ఞానం మాత్రమే,” అని స్వామి వ్యాఖ్యానించారు.

ధార్మిక పరిషత్ పీఠాధిపతి ఎంపికను పర్యవేక్షిస్తుందని, బాహ్య జోక్యం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. “28వ తేదీన మఠాధిపతి అంశంపై ఇరు రాష్ట్రాల భక్తులు, గురుస్వాములు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలి” అని శ్రీకృష్ణమాచార్య స్వామి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలోఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి, తిప్పనమాధవ నాయుడు, బోలా శ్రీనివాసులు,ఇటుకల రవికుమార్,అంబిశెట్టివెంకటసుబ్బయ్య, ఇటుకల ఈశ్వరయ్య, ఇటుకల ఓబులేసు, భాష, ఆకుల కొండయ్య, స్థానిక భక్తులు, సామాజిక నాయకులు, ధార్మిక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

2 thoughts on “పీఠాధిపతి–మఠాధిపతి అంశంపై శ్రీకృష్ణమాచార్య స్వామి స్పష్టీకరణ

  1. మంచి సందేశం ఇచ్చారు స్వామి గారు 😊🙏🙏🙏😊

    1. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే .. జై వీరబ్రహ్మ జై .. , జై గోవిందమాంబ జై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *