Bobbili News: బాడంగి ఎంపీపీ, వైస్-ఎంపీపీ 1 లపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో పైచేయి సాధించిన టీడీపీ..

బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 24-04-2025

అవిశ్వాసంపై మాజీ ఎమ్మెల్యే శ్రీ శంబంగి చినప్పలనాయుడు గారు వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు సారధ్యంలో నియోజకవర్గానికి జరుగుతున్న అభివృద్ధిని చూసి, కొందరు వైసీపీ నాయకులు, ఎంపిటిసిలు బాడంగి మండల పరిపాలనలో కూడా మార్పు రావాలని, ఎంపీపీ మరియు వైస్ఎంపీపీ-1 పై అవిశ్వాస తీర్మానానికి ముందడుగు వేశారు..ఈరోజు బాడంగి మండల కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ప్రిసీడింగ్ అధికారి మరియు ఆర్డీవో శ్రీ జే.వి.ఎస్.ఎస్. రామ్మోహన్ రావు గారు సమక్షంలో 9 మంది ఎంపీటీసీలు మరియు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుతో కలిపి 10 ఓట్లతో ప్రస్తుత ఎంపీపీ మరియు వైస్ఎంపీపీ-1 పై విజయం సాధించారు.

ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు మాట్లాడుతూ, రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి ఈరోజు తెరలేచిందని, గత స్థానిక ఎన్నికలలో ఎవరైతే వైసీపీ నాయకులు అడ్డదారులలో పదవులను దక్కించుకున్నారో, వారి పదవులకు ఈరోజు న్యాయబద్దంగా చరమగీతం పాడామని అన్నారు.. అధికారమదంతో ఆనాడు అధికారులను ఒత్తిడికి, ప్రలోభాలకు గురిచేసి దక్కించుకున్న పదవులను ఈరోజు అవిశ్వాస తీర్మానంతో తామ దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే గారు మాపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

అనంతరం, గౌరవ బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు మాట్లాడుతూ, బాడంగి మండల ఎంపీపీ ఎన్నికలలో అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రభుత్వ అధికారులను ఒత్తిడికి గురిచేసి న్యాయబద్దంగా లాటరీ పద్ధతిలో టీడీపీకి దక్కవలసిన ఎంపీపీ మరియు వైస్ఎంపీపీ-1 పదవులను ఎలా దక్కించున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు..ఇప్పుడు తమకు అధికారం ఉన్నప్పటికీ తాము న్యాయబద్దంగా అవిశ్వాస తీర్మానం ద్వారా వారిని గద్దెదించామని తెలిపారు..బాడంగి మండల వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోవు స్థానిక ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు.. అలాగే, మాజీ ఎమ్మెల్యే శ్రీ శంబంగి చేసిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని, కూటమి సత్తా వైసీపీ నాయకులకు స్థానిక ఎన్నికలలో తప్పక చూపిస్తామని ప్రతిసవాల్ విసిరారు.

ఈ మీడియా సమావేశంలో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ గిరడ అప్పలస్వామి గారు, బాడంగి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ తెంటు రవి గారు, వైస్-ఎంపీపీ శ్రీ సింగిరెడ్డి భాస్కరరావు గారు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీ లచ్చుపతుల సత్యం గారు, టీడీపీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

(PRO, MLA BBL)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *