విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా,రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా శ్రీనివాస్ నేదునూరి డైరెక్షన్ లో కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు జరిగాయి.

విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు చైతన్యపురి శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకానిక్ infra గ్రూపు రామరాజు గారు విచ్చేసి ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి యూనిట్ కు అభినందనలు తెలిపారు.

విజయదశమి పర్వదినాన పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ మూవీకి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ శ్రీనివాస్ నేదునూరి, ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ నాకు మంచి మిత్రులు కావడంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు.యువతను ఆలోచింపజేసే మంచి స్టోరీతో చేస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాక్షించారు.
ఈ చిత్రానికి కథను అందించిన సత్య కుమార్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపి సినిమా విజయవంతం కావాలని ఆకాక్షించారు. డిస్ట్రిబ్యూషన్ రావుఅప్పారావు గారు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

నిర్మాత గుర్రపు విజయ్ కుమార్ మాట్లాడుతూ…ఈ చిత్రం ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో సాగుతూ బలమైన భావోద్వేగాలు ఉంటాయని , సత్య గారు అందించిన మూలకథకు డైరక్టర్ శ్రీనివాస్ నేదునూరి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా డెవలప్ చేసి స్క్రిప్ట్ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ .. యూత్ కు నచ్చే అన్ని అంశాలతో పాటు ఓ సామాజిక స్పృహతో ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

బీఎస్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణుల, ఆర్టిస్టుల వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. దేవినేని ఫేం తేజ రాథోడ్ , ప్రముఖ వెబ్ డిజైనర్ హరీష్,వర్క్ ఇండియా తలారి శ్రీనివాస్ గారు, దగ్గుల గౌరీ శంకర్ గారు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.

One thought on “విజయ చిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కొత్త సినిమా విజయదశమి సందర్భంగా పూజాకార్యక్రమాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *