విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ‘లైగర్’ మూవీ డిజాస్టర్. తరువాత డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్, మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు శనివారం అక్టోబర్ 11 న విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవించిన ఈ కథలో విజయ్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. హీరో సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ నటించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లుఅరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లాప్, కెమెరా, ఫస్ట్ షాట్ కార్యక్రమాలు జరిపారు. సోషల్ మీడియాలో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు రవికిరణ్ కోలా మాట్లాడుతూ — “రౌడీ జనార్ధన్ కథలో మాస్ యాక్షన్ తో పాటు భావోద్వేగం కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. కీర్తి సురేశ్ పాత్ర కూడా చాలా బలమైనది” అన్నారు.

సినిమా యూనిట్ సమాచారం ప్రకారం, ఈ నెల 16నుంచి ముంబయిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ యాక్షన్ సీన్స్, స్టైలిష్ లుక్‌లో విజయ్‌ను చూపించేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.

విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంట ఈ చిత్రంతో మొదటిసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇద్దరి కెమిస్ట్రీ, కొత్త కథా మలుపులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని టీమ్ చెబుతోంది.

సినిమా టైటిల్ “రౌడీ జనార్ధన్” విజయ్ దేవరకొండ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి విజయ్ మరో మాస్ హిట్‌ను అందుకుంటారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

One thought on “విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *