సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఒక విద్యార్థిని భారతమాత వేషధారణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం రూపురేఖలు, దాని ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–బాధ్యతలు గురించి విద్యార్థులకు లోతైన అవగాహన కల్గించాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విశదీకరించారు. రాజ్యాంగ విలువలను చిన్న వయసులోనే పిల్లలలో నాటాలనే లక్ష్యంతో పాఠశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్య‌క్ర‌మంలో సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ ఆర్. వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ జార్జి పీటర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు దేశభక్తితో నిండిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *