80వ దశకంలో సౌత్ ఇండియా వెండితెరను ఏలిన తారలంతా ఒకేచోటకు చేరి స్టార్డం కంటే ఫ్రెండ్షిప్ ఫరెవర్ అంటూ ఇప్పుడు మరోసారి నిజజీవితంలో ఒకే ఫ్రేమ్‌లో తలుక్కున మెరిశారు.
సౌత్ ఇండియా సినిమా రంగానికి గోల్డెన్ ఎరా గా నిలిచిన 1980ల తరం నటీనటులు, ఈసారి చెన్నైలో ‘80s Stars Reunion’ పేరిట మళ్లీ కలుసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేశ్, రాధ, సుహాసిని, జయసుధ, రమ్యకృష్ణ, ఖుష్బూ, రేవతి, నదియా, ప్రభు, భానుచందర్, జాకీ శ్రాఫ్, సురేష్ వంటి 31మంది తారలు ఒకే ఫ్రేమ్‌లో మెరిసి,స్నేహం, నవ్వులు, జ్ఞాపకాలతో నిండిన ఒక అద్భుతమైన సాయంత్రం గడిపారు.
అందరూ ఒకే డ్రెస్సు కోడ్‌లో — ఒకే సన్నివేశంలో కనిపించడం చూసి అభిమానులు ఉత్సాహపడ్డారు.ఈ వేడుకలోని ఫోటోలను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
“ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల వీధిలో ఒక అందమైన నడకలాఉంటుంది.నవ్వులు, ఆప్యాయత,ప్రేమ – దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం ఎప్పటికీ మురిపెంగా ఉంటుంది”అని చిరంజీవి భావోద్వేగంగా రాశారు.
స్నేహానికి కాలపరిమితి ఉండదు
1980లలో తెరపై పంచుకున్న విజయాలు, పోటీలు, పాత్రలు — ఇవన్నీ కాలంతో మారిపోయినా, స్నేహం మాత్రం అదే ఉత్సాహంతో నిలిచింది. ప్రతి రీయూనియన్ ఇప్పుడు కేవలం ఒక వేడుక కాదు… దక్షిణాది సినీ సంస్కృతిలో ఒక అందమైన సంప్రదాయంగా మారింది.
చిరంజీవి, వెంకటేశ్, శరత్‌కుమార్, జాకీ షరీఫ్, భానుప్రియ , సుహాసిని వంటి తారలు తమ కెమెరా లైట్స్ వెలుగుల్లో కాకుండా, హృదయాల వెలుగులో కలుసుకుంటున్నారు. స్నేహం, గౌరవం, ప్రేమ — ఇవే ఈ సాయంత్రం అసలు లైట్స్. రీయూనియన్ – ఒక ఫీలింగ్, ఒక ఫ్రేమ్, ఒక ఫ్యామిలీ
2009లో చెన్నైలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికి దక్షిణాది నాలుగు భాషల తారల మధ్య అనుబంధానికి అద్దం పట్టుతోంది.
స్టార్డమ్ రావొచ్చు, పోవచ్చు — కానీ స్నేహం మాత్రం కాలాన్ని దాటే బంధం.అందుకే ప్రతి రీయూనియన్‌లో కనిపించే నవ్వులు, కౌగిలింతలు, ఫోటోలు —మనందరికీ ఒక సందేశం చెబుతున్నాయి:“ఫేమ్ ఫేడ్ అవుతుందేమో, కానీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అమరంగా ఉంటుంది.”
ఇది కేవలం తారల కలయిక కాదు — సినిమా ప్రపంచం గుండె చప్పుడు. ప్రతి సారి మాదిరిగానే, ఈసారి కూడా ఆ సాయంత్రం ఒక స్మరణీయమైన సినిమా సన్నివేశంలా నిలిచిపోయింది.