Mega Star Chiranjeevi : బాసూ..మీ గ్రేస్ నెక్స్ట్ లెవెల్

వెండితెరపై మళ్ళీ మెగా గ్రేస్ ఏంటో Box Office కు రుచి చూపించబోతున్నారు మన మెగాస్టార్. మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసిన ప్రతీసారి ప్రేక్షకులకు పండగే పండగ. ఈ క్రమంలో మీసాల పిల్ల ఫుల్ సాంగ్ రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని శ్రీ
రవణం స్వామినాయుడు గారు
(అఖిల భారత చిరంజీవి యువత) చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

మీసాల పిల్ల సాంగ్ లో మరో సారి తన సరికొత్త రూపం చూపించిన మన నటరాజు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు

మీసాల pila ఫుల్ సాంగ్

చిరంజీవి గారు .. వెండితెరపై చెరగని సంతకం..
చిరంజీవి గారు.. సినిమాకు రూపమిచ్చిన ఓ కళ..

చిరంజీవి గారు .. ప్రేక్షకులకు వినోదాన్నిచ్చిన రూపం..

చిరంజీవి గారు .. అభిమానులకు నిలువెత్తు ఆరాధ్య దైవం..

దశాబ్దాలుగా చిరంజీవి గారు కొత్త సినిమా అంటే ఆనందం..

తెరపై చిరంజీవిని గారిని చూస్తే ఉత్సాహం..

ఆయన డ్యాన్స్ చేస్తే కళ్లార్పకుండా చూసే అనుభూతి.

ఎన్నేళ్లైనా చిరంజీవి గారు అంటే ఇదే ఆనందం

‘మన శంకరవర ప్రసాద్ గారు..’ నుంచి వచ్చిన ‘మీసాల పిల్ల..’ నిరూపించిందీ మరోసారి.

35ఏళ్ల క్రితం ‘కొండవీటిదొంగ’లోని పాటలో కర్చీఫ్ తో స్టయిల్ గా డ్యాన్స్ చేస్తూ మురిపించిన చిరంజీవి గారు ఇప్పటికీ ఓ మ్యాజిక్.

కొండవీటి దొంగ సాంగ్

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కర్చీఫ్ తోనే మరో కనువిందైన డ్యాన్స్ స్టెప్స్ వేసి.. ‘మారింది కాలమే.. చిరంజీవిగారు కాదు, చిరంజీవి గారు గ్రేస్ కాద’ని చాటిచెప్పిందీ మీసాల పిల్లే.

పాటలో చిరంజీవిగారు డ్రెస్సింగ్, హ్యాండ్సమ్ లుక్స్, కనువిందైన ఆయన డ్యాన్స్ కు వెండితెర వెలిగిపోవడం.. అభిమానులు పులకించడం.. ప్రేక్షకులు మురిసిపోవడం ఖాయం.

ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. యూట్యూబ్ వ్యూస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు..’ సంక్రాంతికి అద్భుతాలే చేయబోతున్నారనేందుకు ఇదే సంకేతం.

ఈ సందర్భంగా.. శ్రీ చిరంజీవిగారికి, నయనతారగారికి, విజయ్ పోలాకిగారికి, సుస్మితగారికి, సాహు గారపాటిగారికి, అనిల్ రావిపూడిగారికి అశేష మెగాభిమానుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ..

మా ఈ ఆనందాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటూ..

రవణం స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

మన శంకరవరప్రసాద్ గారు

2 thoughts on “Mega Star Chiranjeevi : బాసూ..మీ గ్రేస్ నెక్స్ట్ లెవెల్

  1. మెగాస్టార్ అంటే మెగానే మరి చిరు గారా మజాకా సూపర్ 👏👏👏👌👌👌👌👍👍👍👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *