హైదరాబాద్ : పబ్లిక్ టాక్ టివి ( శ్రీనివాస్ నేదునూరి & గుర్రపు విజయ్ కుమార్ )
రవీంద్రభారతిలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ఔత్సాహిక నటీనటుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన లభించింది.ఈ వర్క్‌షాప్‌ను అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ కిషోర్ దాస్, నటుడు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ, సతీష్, ప్రణయ్ రాజ్ వంగరి ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 80 మంది యువ ఔత్సాహిక నటీనటులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
వర్క్‌షాప్‌లో నటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాత్రలో లీనమవడం, వాయిస్ మాడ్యులేషన్, భావోద్వేగాల వ్యక్తీకరణ వంటి అంశాలపై విలువైన సూచనలు, సలహాలు అందించారు.తరువాత పాల్గొన్న వారికి సర్టిఫికేట్‌లు అందజేయడం జరిగింది.
నటుడు కిషోర్ దాస్ మాట్లాడుతూ…నటన అనేది కెమెరా ముందు నిలబడటమే కాదు, అది ఒక సాధన. పరిశ్రమలో విజయవంతం కావాలంటే నటనలోని ప్రతి మెళకువ నేర్చుకోవాలి. క్రమశిక్షణతో కష్టపడితే తప్పక అవకాశాలు వస్తాయి”

నటుడు నువ్వుల వినోద్ కుమార్ మాట్లాడుతూ…సినిమా రంగం అద్భుతమైన వేదిక. కానీ పట్టుదల లేకుండా ఇక్కడ నిలబడడం కష్టం. మా అకాడమీ యువతకు నటనతో పాటు పరిశ్రమలో అవకాశాల దిశగా మార్గదర్శనం చేస్తుందని అన్నారు.
దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ…కొత్త నటీనటులు గ్లామర్‌కి కాకుండా నైపుణ్యం, అంకితభావం మీద దృష్టి పెట్టాలి. మంచి కథలు, పాత్రలు ఎంపికలో దర్శకుల దృక్పథం తెలుసుకోవడం చాలా ముఖ్యం” అన్నారు

దర్శకులు సతీష్ మాట్లాడుతూ… “నేటి సినిమా రంగం కొత్త ప్రతిభను ఆహ్వానిస్తోంది. అయితే, కేవలం నటన మాత్రమే కాకుండా, సమయపాలన, క్రమశిక్షణ వంటి అంశాలు కూడా ఇక్కడ విజయానికి కీలకం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నిరంతర అభ్యాసం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం అవసరం” అన్నారు.
దర్శకులు ప్రణయ్ రాజ్ వంగరి మాట్లాడుతూ… “టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో, నటీనటులు కూడా తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ వంటి కొత్త ప్లాట్‌ఫామ్‌లలో తమ ప్రతిభను చాటుకోవాలి. మంచి పాత్రలు, మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకోవడంలో దృష్టి పెట్టండి. అదృష్టం, కృషి కలిస్తే విజయం మీదే” అన్నారు.
ఈ వర్క్‌షాప్ ఔత్సాహిక నటీనటులకు సినిమా రంగంలో తమ ప్రయాణానికి విలువైన మార్గదర్శనం అందించింది.





