NNR Choudary : “నేను నా లల్లీ” మూవీ దర్శక నిర్మాత NNR చౌదరి గారి స్పెషల్ స్టోరీ

సినిమా అతని శ్వాస…సినిమా అతని ధ్యాస…సినిమా అతని నిబద్ధత..సినిమా అనే ప్రపంచం పట్ల అతనికి ఉన్న మమకారం మాటల్లో చెప్పలేనిది. ఇష్టమైన రంగంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా, పట్టుదలతో తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణం అతనిది.సినిమా నిర్మాణం నుండి నటన, సాంకేతిక విభాగాల వరకూ ప్రతీ కోణంలో అవగాహన పెంచుకుంటూ, “ఇంతితై వటుడింతై” అన్నట్లు చిన్న చిన్న పాత్రలతో మొదలై, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి NNR చౌదరి గారు.

తన సృజనాత్మక దృష్టి, క్రమశిక్షణ, అంకితభావం, మరియు సాధించగలనన్న అచంచల నమ్మకం — ఇవే ఆయనను సినీ ప్రపంచంలో ప్రత్యేక వ్యక్తిత్వంగా నిలబెట్టాయి.
స్క్రీన్ మీద పాత్రల ద్వారా మాత్రమే కాదు, తెర వెనుక తన దిశానిర్దేశం, కథ, పాటల రచయితగా కూడా ఆయన ప్రేక్షకుల హృదయాలను తాకారు.

రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో అనేక అనుభవాలు, సవాళ్లు, విజయాలు … ఇవన్నీ కలగలసిన చౌదరి గారి సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక గాధ. ప్రేక్షకులను అలరించిన కళాకారుడు, ఆలోచనలకు దారితీసిన రచయిత, నూతన దిశ చూపిన దర్శకుడు — ఈ మూడు రూపాలు ఒకటై మిళితమై ఉండే వ్యక్తి NNR చౌదరి గారు.

పబ్లిక్ టాక్ టీవీ గర్వంగా అందిస్తోంది —NNR చౌదరి గారి రెండు దశాబ్దాల సినీ ప్రయాణం.కలల నుండి కృషి వరకు, కృషి నుండి కలకాలం నిలిచే గుర్తింపువరకు సాగిన ఈ సినీ ప్రయాణం అనితర సాధ్యం.

ఈటీవీతో మొదలై నేను నా లల్లీ వరకు

సినిమా ..ఒక కొత్త రంగుల ప్రపంచం.ఈ లోకంలోకి ప్రవేశించాలని ఒకసారి అనిపించినా,ఒకసారి ఎంట్రీ ఇచ్చినా వెనకడుగు వేసేదే ఉండదు. అంతటి మహత్యం , అంతటి విద్యత్తు ఉన్న పరిశ్రమ సినీ పరిశ్రమ. ఇలాంటి ఇండస్ట్రీలోకి యుక్త వయసులోనే బీజం పడింది NNR చౌదరి గారికి. రిలీజైన ప్రతీ సినిమాను చూడటం, సినిమాల్లో డైలాగులు నటన చూసి వాటిపై పట్టు సాధించాలని అకుంఠిత దీక్ష అతనిని సినీ పరిశ్రమ వైపు అడుగులు వేయించింది. చౌదరి గారిది ఆర్థికంగా సామాజికంగా ఉన్నత కుటుంబ అయినా ఇక్కడ అవకాశాలు రావాలంటే మాత్రం నిరంతరం ప్రయత్నించాల్సి వస్తుంది. ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టి తొలి అడుగులు వేసింది ఈటీవీ తోనే..


కారేపల్లి మండలం విశ్వనాథ పల్లికి చెందిన చౌదరి తన 20 ఏళ్ల వయసులో సినిమా అవకా శాల కోసం ఎదురుచూశారు. నటనలో శిక్షణ ఇస్తామని ఓ పత్రికలో వచ్చిన కథనాలను చదివిన చౌదరిగారు విజయవాడలో ఆర్నెల్లపాటు సినీ, సీరియల్ లోని వివిధ అంశాలు, క్యారెక్టర్లపై శిక్షణ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడే స్థిరపడి సీరియల్ రంగాల్లో ఉన్న వారితో పరిచయాలు పెంచుకున్నారు.

అలా ఫిలిం ఇండస్ట్రీ లో పరిచయాలు పెంచుకుని 2005 లోఈటీవీ నేరాలు.. ఘోరాలు ఓ క్యారెక్టర్ నుంచి మొదలైన నట ప్రస్తానం. పద్మ వ్యూహం, నాతిచరామి, చక్రవాకం, దుర్గ, సావిత్రి సీరియల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి , ఆ తరువాత బతుకమ్మ, మల్లెపూవు, క్రైం, రొమాంటిక్ సినిమాల్లో సైతం పలు విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలా రోజులు గడుస్తున్నాయి.
అడపాదపా సినిమాలు, సీరియల్స్ లో చిన్న చిన్న ఆఫర్స్ వస్తున్నాయి.పైగా మన స్టూడియో చౌదరిగారు బాగా దగ్గర బంధువు కావడంతో స్టూడియో బాధ్యతలు కూడా చూసుకుంటూ సినిమాల్లో వేషాలు వేస్తూ ఉండేవారు
.

ఇలా ఎన్నాళ్లు చిన్న పాత్రలు పోషించాలి. గుర్తింపు వచ్చేదెలా? అనే ప్రశ్న నుండి మొదలైంది .. చౌదరి గారి సెకండ్ ఇన్నింగ్స్.తానే ఎంచుకుని సినిమా నిర్మించకూడదు.అని ఆలోచించి ఆలోచనలకు అక్షర రూపమిచ్చి కథలు రాయడం స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే షార్ట్ ఫిల్మ్ చానల్ 9టీవీ ఎఫ్ఎక్స్ ప్రారంభించి 30వరకు షార్ట్ ఫిల్మ్స్కు రూపొందించి అప్లోడ్ చేశారు.వాటికి మంచి ఆదరణ లభించడంతో సినిమా నిర్మాణం, దర్శకత్వంపై దృష్టి సారించారు.


పవన్ తేజ ఫిల్మ్ బ్యానర్ పై అనగనగా ఒక నేను.. అనే సినిమాను రూపొందించి తనే నిర్మాత, దర్శకుడిగా మారి ఆ చిత్రంలో విలన్ పాత్రను పోషించడం విశేషం. జబర్దస్త్ విజయ్, ఆర్యాలు హీరోలుగా, శ్వేతా చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ NNR చౌదరి గారికి మంచి పేరుతెచ్చి పెట్టింది.ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నేను నా లల్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్ డైరెక్షన్ బాధ్యతలతో పాటు ఈ సినిమాలో హీరోగా కూడా చేస్తుండటం విశేషం. త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ గా ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలయిన ప్రమోషనల్ పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే పదానికి నిలువెత్తుని దర్శనంగా నిలిచిన NNR చౌదరి గారు స్వయంకృషితో సినిమా రంగంలో రాణిస్తున్నందుకు సర్వత్ర అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చౌదరిగారిని చూస్తే మహానుభావుడు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం గుర్తుకు వస్తుంది. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం అన్న చందంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లోనే సినిమాను నింపుకుని ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..అనే సిరివెన్నల గారి సాహిత్యానికి సరితూగే పట్టుదలతో ముందుకు సాగుతోన్న NNR చౌదరి గారు మరిన్ని విజయవంతమైన చిత్రాలు నిర్మించాలని, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిత్ర పరిశ్రమలో జెట్ స్పీడ్తో దూసుకుపోవాలని,నేను నా లల్లీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్.

2 thoughts on “NNR Choudary : “నేను నా లల్లీ” మూవీ దర్శక నిర్మాత NNR చౌదరి గారి స్పెషల్ స్టోరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *