Cinematica Expo 2025, Hyderabad Events : హైదరాబాద్లో ‘సినిమాటిక ఎక్స్పో 2025’ – నవంబర్ 1, 2 తేదీల్లో హెచ్‌ఐసీసీ లో ఘనంగా

ప్రధానాంశాలు:

స్థలం: హైదరాబాద్ హెచ్‌ఐసీసీ

తేదీలు: నవంబర్ 1, 2, 2025

ఎక్స్పో ఫోకస్: సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్‌, ఏఐ ఫిల్మ్ మేకింగ్

మద్దతు: తెలంగాణ ప్రభుత్వం

మాస్టర్ క్లాసులు: ప్రముఖ టెక్ నిపుణులు, ఫిల్మ్ మేకర్లు

హైదరాబాద్‌: PUBLIC TALK TV:

తెలుగు సినీ రంగంలో సాంకేతికతకు కొత్త దిశ చూపే ‘సినిమాటిక ఎక్స్పో 2025 మూడో ఎడిషన్ ఈ నెల నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, *సినిమాటిక ఎక్స్పో అండ్ సినికా క్రియేటర్స్ కౌన్సిల్* నిర్వహిస్తోంది.సంస్థ అధ్యక్షుడు మరియు *సినికా క్రియేటర్స్ కౌన్సిల్ ఎం.డి. పి.జి. విందా, గురువారం మీడియాతో మాట్లాడుతూ…”సినికా క్రియేటర్స్ కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థ, *తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో* ఈ ఎక్స్పోను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా *సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్‌, వర్చువల్ ప్రొడక్షన్‌, ఏఐ ఫిల్మ్ మేకింగ్* వంటి ఆధునిక సాంకేతికతలపై *మాస్టర్ క్లాసులు, టెక్ డెమోస్*ఏర్పాటు చేస్తున్నాం,”అని తెలిపారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి **రేవంత్ రెడ్డి** ఇచ్చిన ‘*హాలీవుడ్ టు హైదరాబాద్‌*’ పిలుపు మేరకు ఈ ఎడిషన్‌ను ఆ దిశగా రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

“భారతీయ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే **కొత్త మైలురాయిగా** ఈ ‘సినిమాటిక ఎక్స్పో 2025’ నిలుస్తుంది,” అని పి.జి. విందా విశ్వాసం వ్యక్తం చేశారు .

సినిమాటిక ఎక్స్పో 2025’ ద్వారా హైదరాబాదు దేశంలోనే అత్యాధునిక ఫిల్మ్ టెక్నాలజీ హబ్గా ఎదగబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *