నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకి రంగం సిద్ధం – ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ !

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఘడియ దగ్గరపడుతోంది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్న మొదటి సినిమాకి రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడు అన్న ఆసక్తికి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తొలి చిత్రం తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాకి కొనసాగింపుగా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ హీరోగా అధికారికంగా లాంచ్ కానున్నాడు.

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్

ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నాడు. చారిత్రక నేపథ్యం, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లను విజువల్‌గా అద్భుతంగా చూపించడంలో క్రిష్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘కంచె’, ‘వేదం’ వంటి సినిమాలతో తన స్టైల్‌ను నిరూపించిన క్రిష్, ఇప్పుడు మోక్షజ్ఞ తొలి సినిమాతో మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు.

  • ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే, విజువల్స్ అన్నీ పక్కాగా సిద్ధం చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారట.

జనవరి ఎండింగ్‌లో పూజా కార్యక్రమాలు

‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమాను ఈ జనవరి చివర్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. తొలి సినిమానే కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.

మార్చి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్

పూజా కార్యక్రమాల అనంతరం, మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం లొకేషన్లు, టెక్నికల్ టీమ్, ఆర్ట్ డిజైన్ వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండే సినిమా కావడంతో VFX ప్లానింగ్‌పై కూడా భారీగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

బలమైన క్యాస్టింగ్‌పై క్రిష్ ఫోకస్

ఈ సినిమాలో బలమైన సహాయక నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారట. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ఇతర క్యాస్టింగ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సీనియర్ నటులతో పాటు యంగ్ టాలెంట్‌కు కూడా మంచి స్కోప్ ఉండేలా పాత్రలు డిజైన్ చేస్తున్నారని టాక్.

మోక్షజ్ఞ లుక్ – స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్

నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం మోక్షజ్ఞ లుక్. ఈ సినిమాలో మోక్షజ్ఞను చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో చూపించనున్నారని సమాచారం. ఫిజిక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ నందమూరి వారసుడిగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారట. తొలి సినిమానే కావడంతో క్యారెక్టర్ డిజైన్ విషయంలో బాలయ్య కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

ఇటీవల ఓ సందర్భంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు బాగా తెలుసు. మోక్షజ్ఞ కోసం నా మైండ్‌లోనే ఐదు, ఆరు స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి” అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు మోక్షజ్ఞ లాంచ్ ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి.

డైలాగ్స్ – సాయి మాధవ్ బుర్రా

ఈ సినిమాకి రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఆయన పెన్ నుంచి వచ్చే పవర్‌ఫుల్, ఎలివేషన్ డైలాగ్స్ మోక్షజ్ఞకు మంచి ప్లస్ అవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కోరుకునే మాస్, క్లాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేసేలా డైలాగ్స్ ఉండనున్నాయని సమాచారం.

భారీ అంచనాల మధ్య ‘ఆదిత్య 999 మ్యాక్స్

ఆదిత్య 369’కి కొనసాగింపుగా వస్తున్న సినిమా కావడంతో, అలాగే నందమూరి వారసుడి తొలి చిత్రం కావడంతో ‘ఆదిత్య 999 మ్యాక్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఆధునిక టెక్నాలజీతో ఎలా చూపిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మోక్షజ్ఞ కెరీర్‌కు ఈ సినిమా గేమ్‌చేంజర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *