‘మన శంకరవరప్రసాద్ గారు’ ఘన విజయం: అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి ఒక భావోద్వేగ లేఖను విడుదల చేశారు.

మీరు లేనిదే నేను లేను.. “ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, ఈ అపూర్వ విజయం చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది” అని చిరంజీవి పేర్కొన్నారు. తన జీవితం అభిమానుల ప్రేమతోనే ముడిపడి ఉందని, ‘మీరు లేనిదే నేను లేను’ అన్న సత్యాన్ని ఈ విజయం మరోసారి నిరూపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వెండితెరపై తనను చూడగానే అభిమానులు కొట్టే ఈలలు, చప్పట్లే తన శక్తి అని.. రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ అభిమానుల ప్రేమ మాత్రమే శాశ్వతమని కొనియాడారు.

విజయంలో భాగస్వాములందరికీ ధన్యవాదాలు.. ఈ విజయం కేవలం తనది మాత్రమే కాదని.. తెలుగు ప్రేక్షకులు, ప్రాణసమానమైన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర యూనిట్ సభ్యులు, దశాబ్దాలుగా తన వెన్నంటే నిలిచిన వారందరిదని చిరంజీవి పేర్కొన్నారు. ముఖ్యంగా ‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి ప్రతిభను, నిర్మాతలు సాహు, సుస్మితల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తనపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ.. “ఈ సంబరాన్ని ఇలాగే కొనసాగిద్దాం.. లవ్ యూ ఆల్” అంటూ తన లేఖను ముగించారు.

One thought on “‘మన శంకరవరప్రసాద్ గారు’ ఘన విజయం: అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు

  1. Если вы планируете поездку в Потсдам и интересуетесь, что посмотреть за один день, рекомендую вам начать с посещения известного дворца Сан-Суси и Голландского квартала — в этом месте замечательно сочетается культурное наследие и душевная атмосфера. Дополнительно стоит обратить внимание на на японский сад и крепость Кёнигштайн, а для ценителей природы — парки Германии, которые впечатляют своей красотой и ухоженностью.

    Для тех, кто отправляется через Дюссельдорф, советуем наведаться на барахолку или винтажный рынок (адрес места легко обнаружить), где можно найти увлекательные вещи и узнать с местной культурой. Если увлекают аттракционы, безусловно посетите Фантазия Ленд — цены билетов на билеты и время работы смотрите на их сайте люббенау . Берлин не менее наполнен замками и музеями, которые отлично дополнят ваше путешествие.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *