Headlines

బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు

బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 14-03-2026

బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన పాలకవర్గం సభ్యులకు, సిబ్బందికి అభినందనలు: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి మున్సిపాలిటీ టీడీపీ పాలకవర్గ సమయం ఈ నెల 17వ తేదీన పూర్తవుతున్న సందర్భంగా గౌరవ బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు, బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ శ్రీ రాంబర్కి శరత్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, టీడీపీ పాలకవర్గం గత 10నెలల్లో ప్రజాపాలన ఎలా ఉంటుందో అనేది తెలియజేసేలా నిరూపించిందన్నారు.. సుమారు 10కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు.. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో, తమపై భారం పడినప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా తమ పాలకవర్గం పనిచేసిందని అన్నారు.. తమపై నమ్మకంతో కాంట్రాక్టర్లు కూడా ముందుకొచ్చి అభివృద్ధి పనులను చేసేందుకు సహకరించారని, ఇంకా ముందు ముందు వారందరి సహకారంతో బొబ్బిలి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య పరిష్కారానికి అతి త్వరలో టెండరు ప్రక్రియ మొదలుపెడతామని, సువర్ణముఖీ నది నుంచి రూ123 కోట్లతో పైపులైను పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మూలకు చేరిన గ్రాంటును కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటును కట్టి, నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పునఃప్రారంభం అవ్వడానికి సహకరించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారుకి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ90 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును విస్మరించడంతో ఇప్పుడు రూ33 కోట్ల అదనపు భారం పడుతుందని, అయినా కూడా ప్రజల అవసరాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ప్రస్తుత నీటి సరఫరా అవుతున్న వేగావతి నదిలో నీరు లేకపోవడంతో, పెద్దగెడ్డ నుంచి నీరు విడుదలకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో, 2014-19 మధ్యలో సుమారు 70-80% నిర్మాణం పూర్తైన ఇళ్లను సంపూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పనులను పూర్తిచేసి అతిత్వరలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తామని ప్రకటించారు. బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు సహకారంతో రూ1.19 కోట్లు బొబ్బిలి మున్సిపాలిటీకి బుడా నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు.. తమపై నమ్మకం ఉంచి, పట్టణ అభివృద్ధికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు, మున్సిపల్ సిబ్బందిని అభినందించారు.

గౌరవ బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం పాలనలో బొబ్బిలి పట్టణం ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు.. తమపై నమ్మకం ఉంచి, వైసీపీ కౌన్సిలర్లు కూడా తమతో కలిసి వచ్చి, బొబ్బిలి పట్టణ అభివృద్ధికి సహకరించారని అన్నారు. గత 10 నెలల్లో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంకా ముందు ముందు జరగాల్సిన అభివృద్ధికి బుడా తరుపున తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని తెలియజేస్తూ పాలకవర్గానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

గౌరవ చైర్మన్ శ్రీ రాంబర్కి శరత్ గారు మాట్లాడుతూ, ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బేబీనాయన గారుకి, మాజీ మంత్రి మరియు రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ శ్రీ సుజయ్ నాయన గారికి ఋణపడి ఉంటానని అన్నారు.. బొబ్బిలి పట్టణం అభివృద్ధికి సహకరించిన తన సహచర పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు, అలానే సిబ్బంది కూడా ప్రతి విషయంలో తమ పూర్తి సహకారం అందించారని అన్నారు. బొబ్బిలి పట్టణానికి సంబంధించి ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత మంత్రితో, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి, గత 10నెలల కాలంలో అభివృద్ధి పనులు చేపట్టగలిగామంటే, అందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు కారణమని తెలిపారు.. ప్రతిఒక్క వార్డులో పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఆదేశాలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, త్వరలోనే ఆ పనులను పూర్తిచేస్తామని తెలియజేశారు.

(PRO, MLA BBL)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *