Headlines

మెగాస్టార్‌పై మక్కువతో సైకిల్ యాత్ర: పర్చూరు నుంచి కొండగట్టు మీదుగా చిరంజీవి బ్లడ్ సెంటర్ వరకు నటరాజ్ శ్రీనివాస్ ప్రయాణం!

మెగాస్టార్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన డాన్స్ ని తన డాన్స్ గా మార్చుకుని ఒక డాన్స్ మాస్టర్ గా ఎదిగి మెగాస్టార్ గారి పట్ల తన అభిమానాన్ని చాటుతూమెగా కుటుంబం ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని పరుచూరి ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి కొండగట్టు అంజన్న వద్దకు చేరుకుని అక్కడ మొక్కులు తీర్చుకుని మెగా కుటుంబం పేరున పూజలు జరిపి అక్కడ నుంచి హైదరాబాదులోని చిరంజీవి గారిని కలవాలి అని చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నారు .

మెగాస్టార్ అందుబాటులో లేక మన దేవాలయం చిరంజీవి బ్లడ్ సెంటర్ కు శ్రీ నటరాజ్ శ్రీనివాస్ గారు చేరుకున్నారు .

చిరంజీవి బ్లడ్ సెంటర్ యాజమాన్యం మరియు చిరంజీవి గారి సోదరి శ్రీమతి Dr మాధవి గారు, పరుచూరు నటరాజ్ శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానించి ఆయనను ఘనంగా సత్కరించారు .

అఖిల భారత చిరంజీవి యువత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *