Public Talk Tv వెబ్సైట్ లాంచ్ చేసిన Iconic infra group మేనేజింగ్ డైరెక్టర్ రామరాజు గారు

తెలుగు మీడియా,సినీ రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినాన పబ్లిక్ టాక్ టీవీ డాట్ కం (www.publictalktv.com),పబ్లిక్ టాక్ టీవీ 360 (public talk tv 360)YouTube చానల్ గ్రాండ్ గా లాంచ్ అయింది.


దిల్సుఖ్నగర్ చైతన్యపురి లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో జరిగిన ఈ వెబ్సైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామరాజు గారు విచ్చేసి పబ్లిక్ టాక్ టీవీ డాట్ కం (www.publictalktv.com),
పబ్లిక్ టాక్ టీవీ 360 (public talk tv 360)YouTube చానల్ ను అధికారికంగా లాంచ్ చేశారు. అనంతరం వెబ్ సైట్, యూట్యూబ్ చానల్ వీడియో స్టేషన్ ఐడి లను లాంచ్ చేసి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

అనంతరం రామరాజు గారు మాట్లాడుతూ…గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి నాకు మంచి మిత్రులు, మీడియా, సినిమా, అడ్వర్టైజింగ్ రంగాలలో సుదీర్ఘ అనుభవంతో ఈ వెబ్సైట్, యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తుండటం చాలా సంతోషించదగ్గ విషయం.దినదినాభివృద్ధి చెందుతూ పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ , పబ్లిక్ టాక్ టీవీ 360 యూట్యూబ్ చానల్ మీడియా రంగంలో ఓ బ్రాండ్ లా మారాలని ఆకాంక్షించారు

.ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన సర్ సివి రామన్ స్కూల్స్ డైరక్టర్ రవణం సత్య కుమార్ గారు, శ్రీలక్ష్మీ నరసింహ సినీ ఎంటర్టైన్మెంట్ అదినేత రావు అప్పారావు గారు, వర్క్ ఇండియా శ్రీనివాస్ గారు, కెమెరా మెన్ బీఎస్ కుమార్ గారు, దగ్గుల గౌరీ శంకర్ గారు, వెబ్ డిజైనర్ హరీష్ గారు ,తేజ రాథోడ్ గారు, ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ హనుమ గారు, వినోద్ గారు,మోడల్ , నటి జాస్మిన్ ప్రభాకర్ గారు హాజరై వెబ్సైట్ ఫౌండర్స్ & మేనేజింగ్ పార్టనర్స్ శ్రీనివాస్ నేదునూరి,విజయ్ కుమార్ గార్లు మొదలుపెట్టిన ఈ వ్యాపారం సక్సస్ కావాలని ఆకాంక్షించారు. అనంతరం వెబ్సైట్ ఫౌండర్స్ గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ మా అభివృద్ధిని కాంక్షించి విజయదశమి పర్వదినంగా ప్రారంభించిన పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్, పబ్లిక్ టాక్ టీవి 360 యూట్యూబ్ చానల్ లాంచింగ్ కి వచ్చిన మిత్రులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.

2 thoughts on “Public Talk Tv వెబ్సైట్ లాంచ్ చేసిన Iconic infra group మేనేజింగ్ డైరెక్టర్ రామరాజు గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *