ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా… స్వప్నాన్ని రియాలిటీగా మార్చిన ఒక సామాన్యుడి విజయగాధ ఇది…
హీరోగా, దర్శకుడిగా, గేయ రచయితగా, కథా రచయితగా, నిర్మాతగా– ప్రతి పాత్రలో ప్రతిభ చూపిన బహుముఖ చైతన్యం.
రైతుల బతుకులు, యువతలో మార్పు, కుటుంబ బంధాల విలువ – ఇవన్నీ ఒక్క మనిషి కలం నుండి జాలువారిన చిత్రరూపం వీడే మన వారసుడు
గీతాల ద్వారా ప్రజల హృదయాలను గెలిచి,రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న అక్షర శిల్పి … ఇప్పుడు తెరపై తన సత్తా చాటుకున్న నిఖార్సైన దర్శకుడు!
ఇదే ఆయన గాథ… ఇదే ఆ ప్రేరణ… ‘వీడే మన వారసుడు’ – ఉప్పు రమేష్ సృష్టించిన నిజమైన వారసత్వం!
డ్రగ్స్ మహమ్మారిపై ఓ సామాన్య రైతు మోపిన ఉక్కు పాదం.. వీడే మన వారసుడు చిత్రం
కందుకూరు నియోజకవర్గం కోవూరు గ్రామానికి చెందిన శ్రీ ఉప్పు రమేష్ గారు , ఏ విధమైన సినీ నేపథ్యం లేకుండా హీరో, దర్శకుడు, కథా రచయిత, గేయ రచయిత, నిర్మాతగా బహుముఖ ప్రతిభను ప్రదర్శిస్తూ రూపొందించిన చిత్రం “వీడే మన వారసుడు” విజయవంతంగా విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది.
సమాజంలో రైతుల జీవన స్థితిగతులు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, యువతలో వ్యాపిస్తున్న డ్రగ్స్ మహమ్మారి వంటి సున్నితమైన అంశాలను సమపాళ్లలో మిళితం చేస్తూ ఈ చిత్రం సామాజిక స్పృహతో కూడిన విలువలతో కూడిన చిత్రంగా నిలిచింది.
ఉప్పు రమేష్ గారు తన తొలి సినిమాతోనే తెలుగు సినిమా రంగానికి ఒక కొత్త శక్తిగా నిలిచారు. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రంలో ఆయనతోపాటు లావణ్య రెడ్డి నటన కూడా ఆకట్టుకుంది.సమ్మెట గాంధీ నటన చిత్రానికి హైలెట్ అని చెప్పొచ్చు.
రచయితగా, గేయరచయితగా వందలాది రాజకీయ, సామాజిక గేయాలు రాసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఉప్పు రమేష్ గారు, ఓటు కు నోటొద్దు అనే షార్ట్ ఫిల్మ్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. తన కృషి, పట్టుదల, సామాజిక అవగాహనతో ఈ స్థాయికి ఎదిగిన రమేష్ గారు ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారు.వీడే మన వారసుడు సినిమాతో ఆయన నిరూపించారు — ప్రతిభ ఉంటే నేపథ్యం అవసరం లేదని!
ఉప్పురమేష్ గారు మరిన్ని విలువలతో కూడిన కమర్షియల్ చిత్రాలు చెయ్యాలని పబ్లిక్ టాక్ టీవీ కోరుకుంటోంది.
One thought on “Tollywood sensational Director Uppu Ramesh: తొలి సినిమాతో వెండితెరపై విభిన్న సంతకం..సృజనాత్మక ఉప్పెన ఉప్పు రమేష్”
This moovie in village level sensational one of the best moovie.
Uppu Ramesh acting directon financer every thing moovie controlled by him it’s one of the great moovie.
This moovie in village level sensational one of the best moovie.
Uppu Ramesh acting directon financer every thing moovie controlled by him it’s one of the great moovie.