అక్షరమంటే ప్రేమ…పుస్తకమంటే మమకారం..రచన, రచయితలపై గౌరవం.. ప్రజలపై ప్రేమతో సమాజోద్ధారణ కోసం కలం కదిపే రచయితలెందరో ఉన్నారు.వారిలో ప్రముఖులు శ్రీమతి లక్ష్మీముర్డేశ్వర్ పురి గారు. నాయిక మాలతి, ఆమె సోదరి కమల పాత్రలతో పితృస్వామ్య నిబంధనలను అధిగమించి రాజకీయ, సాంస్కృతిక తిరుగుబాటుతో ఎలా జీవితంలో రాణించాలో అనే ఇతివృత్తాన్ని నేటి మహిళా లోకానికి తెలిసేలా అక్షర రూపమిచ్చారు.
ఇదే నవలను తెలుగులోకి‘ఆమె సూర్యుడిని కబళించింది’ పేరుతో అనువదించడం.. ఆ పుస్తకాన్ని మహిళా సాధికారతను కోరుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆవిష్కరించడం సంతోషదాయకం.
11-10-2025 తేదీన ఉదయం 10 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరిగే పుస్తకావిష్కరణకు మెగాభిమానులు, జనసైనికులు, జనసేన వీరమహిళలు హాజరై విజయవంతం చేయాలని మనవి.
ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న శ్రీమతి లక్ష్మీ ముర్దేశ్వర్ పురి గారికి, ఏపీ వైద్య శాఖ మంత్రి శ్రీ వై.సత్యకుమార్ యాదవ్ గారికి, ఇతర ప్రముఖులకు ఇవే మా శుభాకాంక్షలు.
Very good program s..nd.. nice story s