Actor Vinod kumar Nuvvula Special Story : వినోద్ ఫిలిం అకాడమీ ఫౌండర్ & నటుడు వినోద్ కుమార్ నువ్వుల

Public Talk TV ,Hyderabad: సినిమా అతని తపన… సినిమా అతని సాధన… సినిమా అతని స్ఫూర్తి…సినిమా అతనికి వృత్తి .. సినిమా అతని విధి..,సినిమా అతని జీవన వేదం. సినిమానే అతని సర్వస్వం…ఇవే నటుడిగా తన స్థానాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఆయుధాలు.ఆయన మరెవరో కాదు..సినీ కళామతల్లి ముద్దు బిడ్డ..నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ , తనలాంటి నటులకు మరెందరికో వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా నటనలో శిక్షణ ఇస్తూ సినీ పరిశ్రమకు కొత్త నటీనటులను అందిస్తూ..పలువురి మన్ననలు అందుకుంటున్న హీరో వినోద్ కుమార్ నువ్వుల సినీ ప్రయాణం చాలా ఆసక్తికరం.కొత్తగా సిని పరిశ్రమలోకి వచ్చేవాళ్ళు వినోద్ కుమార్ సినీ ప్రయాణాన్ని స్పూర్తిగా తీసుకుంటారని ఇన్నేళ్ల తన సినీ జీవిత విశేషాలను పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ మీకందిస్తోంది.

కావ్యేషు నాటకం రమ్యం” అన్నది ఆర్యోక్తి .
కావ్యాలన్నింటిలోకెల్లా నాటకం రమ్యమైనది అని అర్థం. చరిత్రలోకి ఓ సారి చూస్తే …ఉద్దండులైన నటీనటుల తొలిఅడుగులు నాటకం నుండే మొదలయ్యాయి.సరిగ్గా ఇలాంటి బాటలోనే పయనించి ఫిలిం ఇండస్ట్రీలోకి చేరుకున్నారు వినోద్ కుమార్ నువ్వుల.నటనలో ఓనమాలు నేర్పింది నాటకమే కాబట్టి వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా ఎంతో మందికి నట శిక్షకులయ్యారు వినోద్ కుమార్ నువ్వుల.

ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు.ఎందుకంటే ఇది అత్యంత ప్రతిభతో కూడుకున్న వ్యవహారం.అవకాశం ఇస్తేనే కదా నిరూపించుకునేది అని కొందరంటే..నిరూపించుకుని వస్తె అవకాశాలు వాటంతట అవే వస్తాయి ..అనేది కొందరి మాట ఏదేమైనా ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మాత్రం నిరంతరం శ్రమించాల్సివస్తుంది.ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు, నిద్రలేని రాత్రులు, తన నటనను వెండితెరపై చూసుకోవాలనే ఆరాటం. …పట్టువదలని విక్రమార్కుడిలా.. , పడిలేచిన కెరటంలా ..చిన్న చిన్న అవకాశాలనే మహా ప్రసాదంలా, పనినే దైవంలా బావించి నేడు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వినోద్ కుమార్ నువ్వుల.

గాడ్‌ఫాదర్లు లేని నటుడు… నాటకమే మార్గం చూపింది.

సినిమా నేపథ్యం లేని కుటుంబం. వెనుకనుంచి తోడ్పాటు అందించే ‘గాడ్‌ఫాదర్’ ఎవరూ లేరు. కానీ తెరపై కనబడాలనే తపన మాత్రం ఆగలేదు. అదే తపన వినోద్ కుమార్ నువ్వులను నటన వైపు నడిపించింది.థియేటర్ ఆర్ట్స్ ఆయనకు మార్గదర్శకమయ్యాయి. వేదికపై ప్రారంభమైన ఆ ప్రయాణం వెండితెర వరకు తీసుకెళ్లింది. చిన్నపాత్రలతో మొదలైన ఆయన నటన – నేడు వెండితెరపై తనదైన ముద్ర వేసింది.

వెండీ తెరపై ప్రయాణం

“లక్ష్మి”, “యమదొంగ”, “ఐఐటి కృష్ణమూర్తి”, “సర్కిల్”, “నేనే ముఖ్యమంత్రి”, “అన్స్పెక్టెడ్ గెస్ట్”, “కీచక”, “టక్ జగదీష్”, “లవర్ బాయ్” త్రిభాణదారి బార్బరిక్ వంటి చిత్రాల్లో వివిధ పాత్రలతో మెప్పించారు.
ఇక హీరోగా “చంద్రోదయం”, “లాంప్”, “ఇది నా సెల్ఫీ”, “తెలుగోడు”, “మా తల్లి” చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మన్ననలు అందుకున్నారు.

చిన్నప్పటి నుంచే నటన పట్ల మమకారం

గుంటూరు జిల్లా నాగభైరవారి పాలెం పుట్టిన వినోద్ కుమార్, చదువు చిలకలూరిపేటలో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే నటన అంటే ఇష్టం. 7వ తరగతిలోనే నాటకాలు వేశారు, 10వ తరగతిలో దర్శకుడయ్యారు. కుటుంబ సభ్యులు కూడా నాటక రంగంలో ఉన్నందున చిన్నప్పటి నుంచే ఆ వేదిక వాతావరణం పరిచయమైంది.
తన నాన్న నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి ప్రోత్సాహమే ఆయనకు బలమైంది.

విద్యా ప్రస్థానం నుంచి సినీ కలల దిశగా

బీకాం పూర్తిచేసి హైదరాబాద్‌కు వచ్చిన వినోద్ కుమార్ సాఫ్ట్‌వేర్ కోర్సులు, ఎంబీఏ కూడా చేశారు. కానీ అంతకన్నా ఎక్కువ ఆకర్షించింది నటన.
ఫోటోలు పట్టుకొని స్టూడియోలను తలుపుతట్టిన ఆ ప్రయత్నం ఫలించింది.
వివి వినాయక్ ఆఫీస్ నుంచి కాల్ రావడం ..“లక్ష్మి” సినిమాలో అవకాశం దక్కింది.
దానికి కొనసాగింపుగా రాజమౌళి దర్శకత్వంలోని “యమదొంగ”లో కూడా పాత్ర దక్కింది.

నాటకం నాకు దారి చూపింది…

“ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టాలో తెలియని నాకు దారి చూపింది నాటకమే,” అని వినోద్ గర్వంగా చెబుతారు.
సినీ మిత్రులు, సీనియర్లు, నాటక రంగం పరిచయాలు ఆయనకు బలంగా నిలిచాయి.

వినోద్ ఫిల్మ్ అకాడమీ — అభిరుచిని అభివృద్ధిగా మలిచే వేదిక

కరోనా కాలంలో షూటింగులు ఆగినప్పుడు, నటనపై ఉన్న ఆసక్తి కొత్త రూపం దాల్చింది. అదే రూపం “వినోద్ ఫిల్మ్ అకాడమీ”గా వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటులు కిషోర్ దాస్ గారు, చిత్రం బబ్లు గారు నట శిక్షణలో నడుస్తున్న వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక నటీనటులు శిక్షణ తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

“తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టు నేర్చుకోవాలి, ప్రతి క్షణం విలువైనది” — అని ఆయన తన విద్యార్థులకు చెబుతారు.

ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ విద్యార్థులకు యాక్టింగ్‌లో మెలకువలు నేర్పుతున్నారు. నటన నేర్చుకోవడమే కాదు, కోర్స్ పూర్తయిన తర్వాత ఫోటోషూట్లు, షార్ట్ వీడియోలు, ఆడిషన్ గైడెన్స్, ప్రొడక్షన్ కనెక్షన్లు వంటి పూర్తి సపోర్ట్ అందిస్తున్నారు.

మా దగ్గర ఫీజులు తక్కువ, కానీ నేర్పేది జీవితానికి ఉపయోగపడే నైపుణ్యం” — వినోద్ కుమార్ నువ్వుల

📞 ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు: 7386667989

ఓటీటీలు – కొత్త నటులకి కొత్త దారులు

“ఇప్పుడు సినిమాలు మాత్రమే కాదు, వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ కంటెంట్ ద్వారా కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి” అని వినోద్ అభిప్రాయం.
ఇలాంటి వేదికలు కొత్త కళాకారులకు పెద్ద సహాయంగా నిలుస్తున్నాయని చెబుతారు.

చిరంజీవితో ఆచార్యలో నటించడం – మధురమైన జ్ఞాపకం

తన కెరీర్‌లో అత్యంత ప్రేరణాత్మకమైన అనుభవం “ఆచార్య”లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లతో కలిసి నటించడం అని చెబుతారు.
హీరోగా నటించిన “ల్యాంప్” చిత్రం తనకు నటుడిగా తృప్తినిచ్చిందని వినోద్ అంటారు.

భవిష్యత్ లక్ష్యాలు

“మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం నా లక్ష్యం. కానీ అదే సమయంలో మరికొంతమందిని కూడా మంచి నటులుగా తీర్చిదిద్దడం నా ఆశయం,” అంటారు వినోద్ కుమార్.
తాను నిర్మించిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లతో పాటు త్వరలో పెద్ద సినిమాలు కూడా నిర్మించాలని సంకల్పం.
భవిష్యత్తులో దశావతారంలా పది పాత్రల్లో ఒకే సినిమాలో నటించాలన్నది ఆయన కల.

త్వరలో విడుదలకు సిద్ధమైన ప్రాజెక్టులు

అమర్జీప్ చౌదరి హీరోగా – మహేంద్ర గారు నిర్మించిన చిత్రం

శాసనమా చట్టమా – హీరో సుమన్ కుమారుడితో ప్రధాన పాత్ర

ఇంకా రెండు ప్రాజెక్టులు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి

వినోద్ కుమార్ నువ్వుల సినీ ప్రయాణం ఎంతోమంది ఔత్సాహిక నటీనటులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
తపన, పట్టుదల ఉంటే కలలు తప్పక నిజమవు తాయి అనేదానికి వినోద్ కుమార్ నువ్వుల సినీ జీవితమే ఉదాహరణ. ముందు ముందు మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ కోరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *