Ap Residetial Bobbili : స్ఫూర్తిగా నిలిచిన బొబ్బిలి ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు

ఏపీ1 గురుకుల పాఠశాల(బాలురు) పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు..

బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు తమ సొంత ఖర్చులతో స్కూలులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను 26 ఆదివారం నాడు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పదిమందికి ఎలా సేవ చేయాలనే దానికి ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు తనకి ఆదర్శమని, వారు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు..

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ అభివృద్ధి పనులు మన ప్రాంతానికే కాకుండా దేశానికే ఒక ఆదర్శమని కొనియాడారు.. తమ సొంత నిధులతో స్కూలును అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు, వారు ఇలా చేస్తున్నారని తనకి తెలిసి ఉంటే, రెసిడెన్షియల్ స్కూలుకు బడులు ఇంకేదైనా స్కూలును తాను దత్తత తీసుకునేవాడిని చమత్కరించారు.. ఏదిఎమైనా తమ పూర్వీకులు దానం చేసిన ఈ స్థలంలో ఉన్న స్కూలును ప్రభుత్వ నిధులతో (ఇప్పటికే రూ4.5 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని గుర్తుచేస్తూ) అభివృద్ధి చేసి, మన రాష్ట్రంలోని ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలగా తీర్చిదిద్దుతానని తెలిపారు..

గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు మాట్లాడుతూ, పాఠశాల పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉందని, వారు చేస్తున్న అభివృద్ధికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ స్కూలును దత్తత తీసుకున్న విషయం తెలిసి చాలా సంతోష పడ్డానని, ప్రభుత్వం నుంచి పాఠశాల అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.. ఉపాధ్యాయుల సంక్షేమం, తద్వారా విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.

అనంతరం, రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుని మరియు ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాసులు నాయుడు గారుని సత్కరించగా, పలువురు పూర్వ విద్యార్థులు స్పాన్సర్ చేసిన స్పోర్ట్స్ కిట్లను, పుస్తకాలను ఆవిష్కరించారు.

(PRO, MLA BBL)

  1. ↩︎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *