బొబ్బిలి నియోజకవర్గం, పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్. 14-10-2025
టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు..
బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీమతి వనుము తౌడమ్మ గారు ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మరణించగా, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ5,00,000 చెక్కును గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు కలిసి వారి కుటుంబసభ్యులకు అందజేస్తూ, టీడీపీ సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి, టీడీపీ గౌరవ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు టీడీపీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాడంగి మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ తెంటు రవి గారు, వైస్ ఎంపీపీ శ్రీ సింగిరెడ్డి భాస్కరరావు గారు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీ లచ్చుపతుల సత్యం గారు, మాజీ ఎంపీపీ శ్రీ బొంతు త్రినాథ గారు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.