గంగన్నపాడు గ్రామంలో కాలువ గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..
బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, గంగన్నపాడు గ్రామం చుట్టుపక్కన ఉన్న చెరువులకు సంబంధించి, ఈమధ్య కురిసిన వర్షాలకు చెరువుల వోలు పారేక్రమంలో, కాలువ ద్వారా ప్రవహించవలసిన నీరు సరైన గట్టు లేనందున గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు దృష్టికి గ్రామ పెద్దలు తీసుకురాగా, ఈరోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆ కాలువను సందర్శించడం జరిగింది..
గత ప్రభుత్వ హయాంలో కాలువగట్టు నిర్మాణం ప్రారంభించినప్పటికీ, సకాలంలో బిల్లులు చెల్లించనందున మధ్యలోనే నిర్మాణ పనులు ఆగిపోయాయని.. ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు అధికారులతో మాట్లాడి, వారు తయారు చేసిన ఎస్టిమేట్ ను గత నెలలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి అందజేయడం జరిగింది.. త్వరలోనే నిధులు మంజూరు చేయించి, కాలువ గట్టు పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు తెలిపారు.