బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 21-10-2025
బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..



ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.. బొబ్బిలి పట్టణ టీడీపీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న సమస్యలను మరియు కొందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, బొబ్బిలి ఏఎంసీ కళాసీ సంఘం సభ్యులు మున్సిపల్ చైర్మన్ శ్రీ రాంబర్కి శరత్ గారుతో కలిసి వచ్చి ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుకి వారి సమస్య విన్నవించగా, సంబంధిత అధికారితో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం, పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘ సమాఖ్య వారు ఏర్పాటు చేయనున్న జాబ్ మేళా పోస్టరును ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఆవిష్కరించారు.












(PRO, MLA BBL)




