కరెంట్ అఫ్ఫైర్స్
అమలాపురం వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు: పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి
కోనసీమ ముంగిట తెలుగు భాషా పండగ! మాతృభాష ప్రాభవాన్ని చాటిచెప్పేందుకు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు అమలాపురం వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ నటులు, రచయిత మరియు దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు తాజాగా ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలు: తెలుగు భాషాభిమానులను అలరించే ఈ బృహత్తర కార్యక్రమం ఫిబ్రవరి నెలాఖరున ప్రారంభం కానుంది. పోస్టర్ ఆవిష్కరణ…
చెల్లి చిరంజీవి గారు: సమాజ సేవకుడు…పర్యావరణ పరిరక్షకుడు – సేవతో నిలిచిన స్ఫూర్తిప్రదాత
సేవ అంటే మాటలు కాదు, చేతలతో రాయాల్సిన చరిత్ర అని నిరూపించిన వ్యక్తి – చెల్లి చిరంజీవి. సమాజంలో మార్పు మాటలతో కాదు, చేతలతో రావాలి. ఈ సత్యాన్ని తన జీవితం మొత్తం ఆచరణలో చూపిస్తూ… నిశ్శబ్దంగా మార్పుకు మార్గం వేస్తున్న పేరు చెల్లి చిరంజీవి. పేదలకు తోడుగా, విద్యార్థులకు వెలుగుగా, రైతులకు ఆత్మీయ సహాయకుడిగా, పర్యావరణానికి అపారమైన రక్షకుడిగా నిలుస్తూ ప్రతి రోజు ఒక కొత్త సేవకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారు. “మానవ సేవే…
సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒక విద్యార్థిని భారతమాత వేషధారణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం రూపురేఖలు, దాని ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–బాధ్యతలు గురించి విద్యార్థులకు లోతైన అవగాహన కల్గించాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విశదీకరించారు. రాజ్యాంగ విలువలను చిన్న వయసులోనే పిల్లలలో నాటాలనే లక్ష్యంతో పాఠశాల ఈ కార్యక్రమాన్ని…
Cinematica Expo 2025, Hyderabad Events : హైదరాబాద్లో ‘సినిమాటిక ఎక్స్పో 2025’ – నవంబర్ 1, 2 తేదీల్లో హెచ్‌ఐసీసీ లో ఘనంగా
ప్రధానాంశాలు: స్థలం: హైదరాబాద్ హెచ్‌ఐసీసీ తేదీలు: నవంబర్ 1, 2, 2025 ఎక్స్పో ఫోకస్: సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ మద్దతు: తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ క్లాసులు: ప్రముఖ టెక్ నిపుణులు, ఫిల్మ్ మేకర్లు హైదరాబాద్: PUBLIC TALK TV: తెలుగు సినీ రంగంలో సాంకేతికతకు కొత్త దిశ చూపే ‘సినిమాటిక ఎక్స్పో 2025 మూడో ఎడిషన్ ఈ నెల నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని…




