champion movie teaser:ఛాంపియన్ టీజర్: ఆట మళ్లీ మొదలెట్టిన రోషన్… గేమ్ చేంజర్‌గా సవాల్ విసిరిన రోషన్

Public Talk Tv Film news :

టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ మేకా వారసుడు రోషన్ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ తర్వాత కొంత విరామం తీసుకున్న రోషన్, ఇప్పుడు తన కెరీర్‌ను కొత్త లెవెల్‌కు తీసుకెళ్లే స్పోర్ట్స్ డ్రామాతో రెడీ అయ్యాడు .ఆ మూవీనే ఛాంపియన్.

మలయాళ టాలెంట్ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కుతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా, అశ్వినీ దత్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా విడుదలైన టీజర్‌లో రోషన్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా దుమ్ము రేపాడు. జట్టు ఆత్మ, సవాలును ఎదుర్కొనే స్పిరిట్ … ఇవన్నీ మాస్ ఎమోషన్‌తో మిళితమై కనిపిస్తున్నాయి. గ్రాండుగా మౌంట్ చేసిన ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా **క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న థియేటర్లలోకి** రాబోతోంది.

“ఆట ఆపదు… గెలుపే గమ్యం” అంటూ రోషన్‌ వాయిస్‌తో ముగిసిన టీజర్, ప్రేక్షకుల్లో ‘ఛాంపియన్’పై భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *