సేవ అంటే మాటలు కాదు, చేతలతో రాయాల్సిన చరిత్ర అని నిరూపించిన వ్యక్తి – చెల్లి చిరంజీవి.
సమాజంలో మార్పు మాటలతో కాదు, చేతలతో రావాలి. ఈ సత్యాన్ని తన జీవితం మొత్తం ఆచరణలో చూపిస్తూ… నిశ్శబ్దంగా మార్పుకు మార్గం వేస్తున్న పేరు చెల్లి చిరంజీవి. పేదలకు తోడుగా, విద్యార్థులకు వెలుగుగా, రైతులకు ఆత్మీయ సహాయకుడిగా, పర్యావరణానికి అపారమైన రక్షకుడిగా నిలుస్తూ ప్రతి రోజు ఒక కొత్త సేవకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారు.
“మానవ సేవే మాధవ సేవ” అనే నమ్మకాన్ని హృదయంలో నిలుపుకున్న ఆయన, తన సమయాన్ని, సంపాదనను, శక్తిని సమాజానికి అంకితం చేశారు. అసలైన పవిత్రత మనిషి మనసులో ఉంటుందని, చేతులలో పరివర్తన శక్తి ఉంటుందని ఆయన జీవితం చెబుతోంది. ఏ సమస్యకైనా పరిమితులు చూపని ఆయన సహాయం — విద్యార్థికైనా, రైతుకైనా, పేదరికంతో పోరాడుతున్న కుటుంబానికైనా — అందరికీ అందుబాటులో ఉన్న ఆశాకిరణమే.
పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా మాత్రమే కాకుండా జీవన విధానంగా మార్చుకున్న చిరంజీవి గారు, నీరు, గాలి, నేల వంటి ప్రకృతి సంపదల విలువను ప్రజలకు తెలియజేయడంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. ఆయన సేవలు పరిశ్రమలకు మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా బలమైన పునాది వేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ అంటే భవిష్యత్తును కాపాడడం — ఈ సందేశాన్ని సామాజికంగా స్థిరపరచిన వ్యక్తి ఆయనే.
తల్లిదండ్రుల విలువలు, పెద్దవారి ఆశీస్సులు తన జీవితం మీద చెరగని ముద్ర వేసినట్లు ఆయన చెబుతారు. ఆ జీవన విలువలకే ప్రతీకగా — తాటిపర్తివారిపాలెం గ్రామంలో ఆయన నిర్మించిన ఆరోగ్య కేంద్రం. ఇది కేవలం ఒక భవనం కాదు; ఒక కుటుంబం సమాజానికి అందించిన అమూల్య కానుక.
సత్కారాలు, పురస్కారాలు — పద్మ చక్ర అవార్డు, ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు, అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ — ఇవన్నీ ఆయన సేవయాత్రకు వచ్చిన సహజ ఫలితాలు మాత్రమే. కానీ ఆయన చెబుతున్న మాట ఒక్కటే: “సేవ అంటే కీర్తి కాదు, సమాజం కోసం మనం చేయగలిగిన చిన్న హస్తం.”
సంకోచం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, అవసరం ఉన్న చోట సహాయం చేసే మనసు కలిగి ఉండడం చాలా అరుదు. ఆ అరుదైన హృదయం, ఆ అపూర్వమైన మానవతా విలువలు చెల్లి చిరంజీవి గారిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ఈ భూమిపై పుట్టి భూమాతను కాపాడటమే నిజమైన మనుష్యత్వమని, మనిషి మనిషికి తోడు నిలబడటమే అసలైన ధర్మమని ఆయన జీవితం మనకు తెలియజేస్తోంది.
సేవతో జీవించే వ్యక్తులు చాలా మంది ఉంటారు, కానీ సేవను జీవన వేదంగా, పరమావధిగా మార్చుకునే వ్యక్తులు చాలా అరుదు. ఆ అరుదైన వెలుగుల్లో ఒక వెలుగు – చెల్లి చిరంజీవి
చెల్లి చిరంజీవి – సమాజ సేవలో అంకితభావం, పర్యావరణ పరిరక్షణలో ప్రేరణ
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని దగ్గుబాడు గ్రామానికి చెందిన చెల్లి చిరంజీవి గారు, 1993 నుండి హైదరాబాద్లో స్థిరపడి వివిధ రంగాలలో సేవ చేస్తూ, సమాజానికి అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తి. *04–05–1970* న జన్మించిన చిరంజీవి గారు, *తల్లిదండ్రులు Late శ్రీ చెల్లి రాజారావు మరియు గ్రేసుమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.
చిరంజీవి గారి విద్యాప్రస్థానం
BE (Civil Engineering)
M.Tech (Water Resources Engineering)
పర్యావరణం భద్రతకు సంబంధించిన ప్రత్యేక కోర్సులలో నైపుణ్యం సాధించారు.
వృత్తి జీవితం – 29 ఏళ్ల అనుభవం
ప్రస్తుతం NAVEGA Enviro Engineers & Consultants లో Chief Executive – Operations గా పనిచేస్తున్నారు.
వాటర్, సాయిల్, నాయిస్, ఎయిర్, బయాలజికల్ పరిరక్షణ వంటి పర్యావరణ అంశాల కోసం వివిధ పరిశ్రమలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నారు. 1996లో ప్రారంభమైన చిరంజీవిగారి సేవాప్రయాణం, నేటికీ పర్యావరణ రక్షణ లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
పర్యావరణం, నీరు, గాలి, నేల — ఇవన్నీ మన భవిష్యత్తు అనే నిజాన్ని ప్రజలలో నాటిన పర్యావరణ యోధుడు -చెల్లి చిరంజీవి గారు
NAVEGA Enviro Engineers & Consultants కు 29 ఏళ్ల అనుభవం
పర్యావరణ కన్సల్టెన్సీ రంగంలో ప్రముఖ సంస్థ NAVEGA Enviro Engineers & Consultants. 1977లో ప్రారంభమైన ఈ సంస్థలో 1996నుండి కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి గారు 29 ఏళ్ల సేవా అనుభవంతో ఎంతో మందికి సేవలందించారు. వివిధ పరిశ్రమల కోసం నీరు, నేల, గాలి, శబ్దం వంటి పర్యావరణ పరిరక్షణ పరామితులపై సాంకేతిక సేవలు అందిస్తోన్న ఈ సంస్తలో జీవవైవిధ్యం (flora & fauna) సంరక్షణలో కూడా నిపుణుల సహాయాన్ని ఈ సంస్థ అందిస్తోంది.
*కుటుంబం*
సతీమణి: హన్నీ ఫ్లోరెన్స్
కుమారుడు:నిషాంత్ షైన్
కుమార్తె: నిషితా షైనీ
సేవే ధర్మం – సమాజానికి ఆత్మీయమైన అండగా… *తన ఉద్యోగ బాధ్యతలతో పాటు
*పేదలకు, విద్యార్థులకు, రైతులకు సహాయం
సామాజిక సేవా సంస్థలకు ఆర్ధిక సహకారం అందిస్తూ ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు. తాతయ్య–బామ్మల స్మృతికి ఆరోగ్య కేంద్రం నిర్మాణం.
దుద్దుకూరు మండలం, తాటిపర్తివారిపాలెం గ్రామంలో తన *అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థం * ఒక ఆరోగ్య కేంద్రం నిర్మించి గ్రామ ప్రజలకు అంకితం చేశారు
అభినందనలు – గౌరవాలు – పురస్కారాలు
*Padma Chakra Award – 17th August 2025*
GCS Valluri Foundations & Telangana Rastra Bhasha Samskruthika Sakha తరఫున రవీంద్ర భారతి, హైదరాబాద్ వేదికగా డా. వల్లూరి శ్రీనివాస్ రాజు, ప్రఖ్యాత హాస్యనటుడు బాబు మోహన్ తదితరులు ఈ పురస్కారాన్ని అందించారు.
*Pride of India Award – 9th November 2025*
ప్రగతి ఫౌండేషన్స్ & తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు,శ్రీ ఆర్.కృష్ణయ్యగారు ఈ గౌరవాన్ని అందజేశారు.
22nd November 2025న ఊటీ నగరంలోని జెమ్ హోటల్లో అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం, జర్మనీ తరపున సామాజిక సేవల గుర్తింపుగా *Honorary Doctorate in Social Work* అందించారు. ఈ కార్యక్రమానికి *అమ్మ ఆనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు *శ్రీ మల్లేపుల వెంకట రమణ* గారు మార్గదర్శకత్వం వహించారు.
*చెల్లి చిరంజీవి గారి నమ్మకం
మానవ సేవే మాధవ సేవ
సమాజానికి, భూమాతకు మనం చేయగలిగిన సేవే మన అసలు సంపద. చెల్లి చిరంజీవి గారి జీవితం – విద్య, వృత్తి నైపుణ్యం, పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ – ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని, మరిన్ని సేవాకార్యక్రమాలు చెయ్యాలని పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ కోరుకుంటోంది.