హైదరాబాద్, పబ్లిక్ టాక్ టీవి,( శ్రీనివాస్ నేదునూరి, గుర్రపు విజయ్ కుమార్)
అపోలో ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న పేషేంట్ కి అత్యవసరం గా Platelets అందించిన మెగా రక్తదాత శ్రీ కొమ్మిశెట్టి అభిలాష్ గారిని అభినందిస్తున్న శ్రీ రవణం స్వామి నాయుడు గారు.
పేదల పాలిట పెన్నిధి..సహాయం కోరిన వెంటనే స్పందించే సహృదయం.. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో మెగాస్టార్ లా జనం గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మేరు నగదీరుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్* ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ఎందరికో ప్రాణదాతగా నిలుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా నిలిచిన ఆపద్బాంధవుడు.అందుకే కోట్లాది గుండెల్లో చిరుదివ్వె అయ్యారు. ఎందరో అభిమానులకు మార్గదర్శిగా నిలిచారు. .ఆయన్ను ఫ్యాన్స్ ఎంతలా అభిమానిస్తారో…చిరు కూడా ఫ్యాన్స్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు.వారికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ కొండంత అండగా మిలుస్తారు. అలా అభిమానుల్లో నిరంతరం సేవా స్ఫూర్తిని నింపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరు. ఈ సేవాస్ఫూర్తితో మెగా రక్తదాత శ్రీ కొమ్మిశెట్టి అభిలాష్ గారు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్ శ్రీ రవణం స్వామినాయుడు గారు రక్తదాత కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అపోలో హాస్పిటల్ లో అత్యవసరంగా Platelets అవసరం అని తెలియగానే హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కె.అభిలాష్ గారు గురువారం 16 వ తేదీన CCT లో (O + ve), Sdp – Platelets Donation చేసారు .
ఆపదలో రక్తదానం చేసిన శ్రీ K.అభిలాష్ గారికి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము .
చిరంజీవి బ్లడ్ సెంటర్ లోనే కాక బయట Donations కలుపుకొని ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేసిన మెగా రక్తదాత శ్రీ అభిలాష్గారికి,వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …