గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు.
గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు.
సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు.
కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు
ఇదే సమాజానికి ఆయన అందించిన చాలా పెద్ద ప్రోత్సాహం.కానీ, అంతటితో ఆగకుండా, చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు కోట్లాది*రూపాయలు వెచ్చిస్తున్న… శ్రీ రామచంద్ర ప్రభు గారి సేవా దృక్పథాన్ని మాటల్లో వర్ణించలేం.
ఆయన దార్శనికత ఎన్నో కుటుంబాల్లో వెలుగులు కురిపించింది… ఇంకెంతోమంది*జీవితాల్లో వెలుగులు పూయిస్తూ… నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
శ్రీ తులసి రామ చంద్ర ప్రభు గారిని ,వారి కుటుంబాన్నీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
మరొక్కసారి శ్రీ రామచంద్ర ప్రభు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
రవణం స్వామినాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*