తెలుగు సినిమా స్టామినా ను ప్రపంచ స్థాయిలో చాటిన ఘనత దర్శకదిగ్గజం రాజమౌళి కే దక్కుతుంది. మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆస్కార్ విన్నింగ్ మూవీ RRR వరకు ఓటమి అనేదే తెలియని రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
అక్టోబర్ 10 రాజమౌళి బర్త్ డే సందర్భంగా బాహుబలి ఎపిక్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.విజన్, కరేజ్ , పాషన్ అంటూ క్యాప్షన్ తో సామాజిక మాధ్యమం X వేదికగా రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
Vision. Courage. Passion.
From the kingdom of Maahishmathi, we bow to the visionary who imagined it all🙏
ఈ BTS రూపంలో రిలీజ్ చేసిన ఈ బాహుబలి ఎపిక్ వీడియోలో జక్కన ఆర్టిస్టులకు సీన్ ఎలా వివరిస్తూ నటిస్తున్నారో క్లియర్ గా చూపించారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు జక్కన్న, మజాకా నా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక..సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి SSMB 28 కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ మూవీ నుంచి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో బాహుబలి ఎపిక్ వీడియో రిలీజ్ చేసి అక్టోబర్ 31 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరొక్క సారి దర్శక ధీరుడు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్.