Mana Film Chamber of commerce 24crafts : ఆత్మీయ సమావేశం

మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్ 24 క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభ నందు ఆత్మీయ సమావేశం విజయవంతం అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చైర్మన్ డాక్టర్ రాజేంద్ర తెలిపారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క కార్డు హోల్డర్ కి జూనియర్ ఆర్టిస్టులకు మరియు 24 క్రాఫ్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు త్వరలో అందిస్తాను మరియు ఇతర సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.

అదేవిధంగా ఎంతోమంది చిన్నచిన్న నిర్మాతలు నష్టపోతున్నారని వారందరికీ మా ఛాంబర్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో కెమెరాలు ఎడిటింగ్ వాటి సంబంధించిన పర్మిషన్లు ఇవ్వటం జరుగుతుందని ఈ విషయం మీద ప్రతి ఒక్క చిన్న నిర్మాతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.

అలాగే ఎలాంటి పర్మిషన్ అర్హత లేకుండా కొన్ని సంస్థలు వాట్సాప్ లోనే డాక్టరేట్ అని ప్రధానం చేస్తున్నారు అలాంటి వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము తెలియపరిచిన వెంటనే వారి పైన చర్యలు తీసుకున్నందుకు ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు అని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా మన ఫిలిం ఛాంబర్ అభివృద్ధి చేసేందుకు విజయవాడ లో ప్రధాన ఆఫీసు త్వరలో ప్రారంభోత్సవం చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల అధ్యక్షులు సెక్రెటరీ జూనియర్ ఆర్టిస్టులు కాస్టింగ్ కాల్స్ డైరెక్టర్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్. మాదల నాగూర్. తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు విజయ్ కుమార్. సెక్రెటరీ నిర్మాత. లల్లి మధుమిత. లేబర్ కోర్టు చైర్మన్&టైంటిక్ కమిట్మెంట్ ప్రెసిడెంట్ కాకుమాన్ జ్యోతి కుమారి . దర్శకులు లయన్ రంజిత్ కుమార్ సెంట్రల్ ఇంచార్జి మరియు తెలంగాణ ఇన్చార్జి రాజనాల సత్య,సీనియర్ జర్నలిస్టు దర్శకులు. రమేష్. దర్శకులు నిర్మాతలు పి ఎస్ శర్మ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ మూవీ రైటర్ ఎర్ర సంజీవరాజ్. మాజీ ఎమ్మెల్యే & కడప జిల్లా ప్రెసిడెంట్ జయరాం గారు రాయలసీమ ఇన్చార్జి కరుణాకర్ రెడ్డి కర్నూలు మేకప్ మెన్ యాక్టర్ లక్ష్మి. హీరోయిన్ లక్ష్మి. డబ్బింగ్ ఆర్టిస్ట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *