మోహన్ బాబు ఇంట్లో దీపావళి సందడి… మంచు కుటుంబం ఒక్కచోట, కానీ మనోజ్ ఫ్యామిలీ & మంచు లక్ష్మీ లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది.
మంచు కుటుంబం ఇంట్లో దీపావళి వేడుకలు ఈసారి సందడిగా జరిగాయి. ప్రముఖ నటుడు, నిర్మాత డా. మోహన్ బాబు గారి నివాసంలో దీపావళి పండుగ వేడుకలు కుటుంబ సభ్యులంతా కలిసి దీపాలు వెలిగించి, పటాకులు పేల్చి, ఆనందంగా దీపావళిని జరుపుకున్నారు.
మంచు విష్ణు ఫ్యామిలీతో పాటు తల్లిదండ్రులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందరి ముఖాల్లో కనిపించిన ఆ ఆనందం, ఆత్మీయత అందరికీ హృదయాన్ని హత్తుకునేలా అనిపించింది.
అయితే ఈ వేడుకల్లో మంచు మనోజ్ , మంచు లక్ష్మీ కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం విశేషంగా మారింది. కుటుంబం మొత్తం కలిసి జరుపుకున్నా, మనోజ్ ఫ్యామిలీ, లక్ష్మీ గైర్హాజరు అభిమానుల్లో ఆసక్తి రేపింది. కన్నప్ప సక్సస్ తరువాత మంచు ఫ్యామిలీలో ఎలాంటి మనస్పర్ధలు లేవని అందరూ ఒకటయ్యారని అనుకున్న సమయంలో మంచు మనోజ్ ఈ ఫోటోల్లో లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. దీపాల వెలుగుల్లో మెరిసిన మోహన్ బాబు ఇంటి ఆవరణ, నవ్వులు, ప్రేమ, ఆనందంతో నిండిపోయింది. పండుగ సమయాల్లో కుటుంబం అంతా కలసి గడపడం కన్నా గొప్ప ఆనందం ఏదీ లేదని ఈ వేడుక మరోసారి నిరూపించింది.