పండగకి వస్తున్నారు అంటూ ప్రతి పండక్కి వచ్చి అద్భుతమైన సర్ప్రైజ్లు ఇస్తున్న మన శంకరవరప్రసాద్ గారు దీపావళికి కూడా మంచి పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చారు.
ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి మనశంకరవరప్రసాద్ గారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సంక్రాంతికి మెగా పొంగల్ & మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ తో బాక్స్ ఆఫీస్ లో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికీ విడుదలైన గ్లింప్స్, మీసాల పిల్ల సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
అనిల్ రావిపూడి సినిమాలకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. డిఫరెంట్ పబ్లిసిటీ ఐడియాస్ తో మాస్ ని ఆకట్టుకునే రీల్స్ ,పోస్టర్స్ రెడీ చేస్తూ విడుదల చేయడం అనిల్ స్టైల్. ఇప్పుడు ఈ దీపావళి పండుగ సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి హ్యాపీ దీవాలి అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో మెగాస్టార్ స్టైలిష్ గా సైకిల్ తొక్కుతూ ఉంటే పక్కన ఇద్దరు చిన్న పిల్లలు కూడా సైకిల్ తో రావడం కనిపిస్తుంది. మెగాస్టార్ సినిమాల్లో చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలుంటాయని మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ ఉంటుందని మనకు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలు చూడాలో వేచి చూద్దాం. ముందుగా ఈ టీమ్ అందరికీ హ్యాపీ దీవాలి.
One thought on “Mega Diwali Wishes: మన శంకరవరప్రసాద్ గారు మూవీ పోస్టర్ రిలీజ్”
సూపర్… సూపర్… సూపర్బ్… మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్స్ & లుకింగ్ స్టిల్స్ సూపర్ 😊😊😊👌👌👌👌👏👏👏👏👏👍👍👍
సూపర్… సూపర్… సూపర్బ్… మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్స్ & లుకింగ్ స్టిల్స్ సూపర్ 😊😊😊👌👌👌👌👏👏👏👏👏👍👍👍