సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ కొత్త రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోంది. అన్ని ప్రాంతాల్లో ఫాస్ట్ ఫిల్లింగ్స్, హౌస్‌ఫుల్ షోలు నమోదవుతుండటంతో సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే ‘మన శంకరవర ప్రసాద్ గారు’ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కథ, వినోదం, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయని ట్రేడ్ వర్గాల మాట.
సంక్రాంతి బాక్సాఫీస్‌లో మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివస్తుండగా… రాబోయే వీకెండ్ కూడా ఇదే జోరు కొనసాగనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.