చిన్నా-పెద్దా అందరికీ మెగాస్టార్ అంటే ఎనలేని అభిమానం
6 నుంచి 60ఏళ్లు పైబడిన వయసు వారినీ అలరించే ప్రముఖ నటులు శ్రీ చిరంజీవి గారు

తెరపై ఆయన్ని చూసి మురిసిపోయిన వారెందరో జీవితాశయం ‘చిరంజీవి’గారిని కలుసుకోవాలని…వారిలో అభిమానులు, బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్.. జనరేషన్స్ కు అతీతంగా చిన్నారులూ ఉండటం విశేషం.వారిలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రామచంద్రరావుగారి మనవరాలు చిన్నారి ఐరా ఆశిష్ ఉన్నారు.
ఆస్ట్రేలియాలో ఉంటూ చిరంజీవిగారి సినిమాలు చూస్తూ మురిసి ఆయన్ను కలుసుకోవాలనే కోరిక ఆ చిన్నారిది.హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ లో ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలుసుకుని మురిసిపోవడం ముచ్చటగొలిపే విషయం.జనరేషన్స్ కు అతీతంగా అభిమానుల్ని సొంతం చేసుకుంటున్న చిరంజీవిగారిని..పొలిటికల్ బిజీలో ఉంటూ మనవరాలి ముచ్చట తీర్చిన శ్రీరామచంద్రరావుగారి అభిమానానికి …మెగాభిమానులగా మేము ముగ్దులయ్యామని తెలియజేసుకుంటూ..




