తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్‌పై కనకవర్షం కురిపించాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఇద్దరూ కలసి చేసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేపింది. అలాంటి అద్భుతమైన కల్ట్ మాసివ్ బ్లాక్ బస్టర్ రౌడీ అల్లుడు.1991 అక్టోబర్ 18న రిలీజ్ అయిన రౌడీ అల్లుడు సినిమా విడుదలై నేటికి 34 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రౌడీ అల్లుడు పై స్పెషల్ స్టోరీ అందిస్తోంది పబ్లిక్ టాక్ టీవీ
చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ మొదలయింది ‘మోసగాడు’ సినిమాతో. అందులో చిరంజీవి విలన్ పాత్రలో నటించినా, రాఘవేంద్రరావు ఆయనతో స్టెప్స్ వేయించి, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టారు.ఆ తర్వాత ‘తిరుగులేని మనిషి’ చిత్రంలో కూడా చిరంజీవి నటనకు మంచి పేరు వచ్చింది. కానీ, హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన తొలి చిత్రం ‘అడవిదొంగ’ కామర్షియల్గా భారీ విజయం సాధించింది..ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో పలు హిట్లు రాగా, అందులో అత్యంత గుర్తింపు తెచ్చిన చిత్రం ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’. ఆ తర్వాత, 1991 అక్టోబర్ 18న విడుదలైన ‘రౌడీ అల్లుడు’ మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అల్లు అరవింద్ సమర్పణలో, శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ పతాకంపై డా. కె. వెంకటేశ్వరరావు మరియు పంజా ప్రసాద్ నిర్మించిన రౌడీ అల్లుడు సినిమా 1991 అక్టోబర్ 18 న విడుదలై నేటికీ 34 ఏళ్ళు.

మెగా స్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ రౌడీ అల్లుడు మూవీలో ఒకవైపు కోటీశ్వరుడు కళ్యాణ్, మరోవైపు ఆటో డ్రైవర్ జానీ. కథలో మలుపులు, హాస్యం, భావోద్వేగం, రాఘవేంద్రరావు స్టైల్ సాంగ్స్ ఈ సినిమాను తారాస్థాయికి తీసుకుని వెళ్ళాయి. కథలో విలన్ కుట్రల మధ్య జానీ చేసిన మార్పు, అతని పశ్చాత్తాపం, కుటుంబాన్ని రక్షించే సీక్వెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
హీరోయిన్స్ గా అందాల భామలు శోభన, దివ్యభారతి తమ నటనతోకుర్రకారకు మతులు పోగొట్టారు.
కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, కెప్టెన్ రాజు, బ్రహ్మానందం, సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిస్కో శాంతి “అమలాపురం బుల్లోడా…” పాటలో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.
సిరివెన్నెల, భువనచంద్ర సాహిత్యనికి
సంగీత దర్శకుడు బప్పిలహిరి అందించిన మ్యూజిక్ చాట్ బస్టర్ గా నిలిచింది.“చిలుకా క్షేమమా…”, “కోరి కోరి కాలుతుంది…”, “లవ్ మీ మై హీరో…”, “ప్రేమా గీమా తస్సాదియ్యా…” పాటలు ఈ రోజుకీ వినసొంపుగా ఉంటాయి.రాఘవేంద్రరావు మార్క్ విజువల్స్, చిరంజీవి ఎనర్జీ, పాటల ప్రెజెంటేషన్ – ఇవే సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఇప్పటికే యంగ్ డైరక్టర్స్ రౌడీ అల్లుడు సినిమా స్ఫూర్తి తో చిరంజీవితో సినిమాలు తీద్దామని అనుకుంటూ ఉంటారు. 34 ఏళ్లు పూర్తయిన చిరు లో ఉన్న గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికే అదే రౌడీ అల్లుడు లా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు చిరు.






That is our Megastar chiranjeevi garu… Superb 😊👌👏👍😊