Mega Victory Pongal: ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్

సంక్రాంతి 2026కు తెలుగు సినిమా ప్రేక్షకులకు డబుల్ ఫెస్టివల్ ట్రీట్ రాబోతోంది!
మెగాస్టార్ *చిరంజీవి– విక్టరీ వెంకటేశ్ కలసి తెరపై సందడి చేయనున్న చిత్రం ‘మన శంకరవరప్రసాదారు’. ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు
. ఈ క్రమంలో గురువారం మన శంకర వరప్రసాద్ గారు మూవీస్ సెట్లోకి విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో లో చిరు వెంకీకి వెల్కమ్ చెప్పారు.ఈ వీడియో ను చిరు తన x ఖాతాలో పోస్ట్ చేశారు.

సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అందాల తార నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా
తాజాగా, వెంకటేశ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని భారీ సెట్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకీ సెట్లోకి అడుగు పెట్టిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా, అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం – ‘ ప్రస్తుతం చిరంజీవి, వెంకటేశ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. కామెడీ, యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం నిలుస్తుంది” అని తెలిపారు.

ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో  తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది నిజమైన సంక్రాంతి విజువల్ ఫీస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.


కాగా.. వశిష్ట డైరెక్షన్ లో  చిరంజీవి విశ్వంభర వేసవి కానుకగా విడుదల కానుంది. బాబి డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇక.. వెంకీ విషయానికొస్తే త్రివిక్రమ్ తో మూవీ ఇటీవల లాంచ్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *