సంక్రాంతి బరిలో విడుదలైన
#ManaShankaraVaraPrasadGaru* సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి షో నుంచే థియేటర్లలో విజిల్స్, క్లాప్స్‌తో సందడి నెలకొనగా… అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం, సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల తొలి ఎంపికగా నిలుస్తోంది. కథనం, ఎమోషన్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉండడంతో సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
200 కోట్ల క్లబ్‌లోకి #MegaSankranthiBlockbusterMSG
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించిఈ సినిమా #MegaSankranthiBlockbusterMSGగా నిలిచింది.
విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ట్రేడ్ సర్కిల్స్ ఆశించిన దానికన్నా ఎక్కువ షేర్‌లు నమోదవుతున్నాయి.
పండుగ సెలవుల ప్రభావంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ భారీగా థియేటర్లకు రావడంతో ఆక్యుపెన్సీ శాతం 100కి చేరడం విశేషంగా మారింది. ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను ఫుల్ రేంజ్ బ్లాక్‌బస్టర్గా అభివర్ణిస్తున్నాయి.
ప్రేక్షకులే అసలు హీరోలు
ఈ ఘన విజయానికి ప్రధాన కారణం ప్రేక్షకులే అని చిత్ర బృందం పేర్కొంటోంది.
*“రెండువందల కోట్ల కలెక్షన్లు అందించిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు” అంటూ యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ముఖ్యంగా పబ్లిక్ రివ్యూస్, వీడియో రియాక్షన్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ప్రేక్షకుల #1 ఆడియెన్స్ చాయిస్ మూవీ
సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాల్లో
ప్రేక్షకుల #1 ఆడియెన్స్ చాయిస్ మూవీ*గా
*మన శంకరవరప్రసాద్ గారు* నిలిచింది.
పూర్తి వినోదంతో పాటు సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రస్తుతం అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా చూడని వారు తప్పక థియేటర్లలో ఈ అనుభూతిని ఆస్వాదించాల్సిందే అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.