మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’ విడుదల తేదీ ప్రకటించారు!.
ఈ ఏడాది వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఇప్పుడు తన ఐదో సినిమాతో తెరపై మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ వంటి చిత్రాలతో తన నటనతో కట్టిపడేసిన ఈ స్టార్ హీరో ‘వృషభ’ ద్వారా కొత్త యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు.
నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇటీవల విడుదలైన టీజర్లో మోహన్‌లాల్ యోధుడి గెటప్‌లో దర్శనమిచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.ఇక..ఎట్టకేలకు తాజాగా చిత్రయూనిట్ అఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తూ, ‘వృషభ’ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను షేర్ చేసింది.
ఆ పోస్టర్లో “భూమి కంపిస్తుంది… ఆకాశం ఎరుపెక్కుతుంది… విధి తన యోధుడిని ఎంచుకుంది…” అనే డైలాగ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.
పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు శోభా కపూర్ మరియు ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మోహన్‌లాల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే ఈ ‘వృషభ’ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.