క్రియేటివ్ విజువల్స్, ఎనర్జిటిక్ వైబ్, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్న పోస్టర్ ఇది. తాజాగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా హుక్‌స్టెప్ సాంగ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా “HOOKSTEP – Song Launch Today at Pre Release Event” అనే లైన్‌తో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
దర్శకుడు అనిల్ రవిపూడి మార్క్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను మరోసారి ఈ పోస్టర్ స్పష్టంగా చూపిస్తోంది. స్టైలిష్ లుక్‌లో హీరో కుర్చీలో కూర్చుని చుట్టూ డ్యాన్సర్లతో ఎనర్జీతో నిండిన ఫ్రేమ్ సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఇది కేవలం ఒక పాట పోస్టర్ మాత్రమే కాదు… సినిమా టోన్, టెంపో, మాస్ మూడ్‌ని ముందుగానే చెప్పేసిన విజువల్ టీజర్లా ఉంది.
హుక్‌స్టెప్ – మాస్ ఆడియన్స్‌కు పండగ
ఈ సినిమాలోని హూక్స్టెప్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. పోస్టర్‌ను గమనిస్తే – డాన్స్, లైటింగ్, కాస్ట్యూమ్స్, హీరో యాటిట్యూడ్ అన్నీ కలిసి ఒక మాస్ ఫెస్టివల్‌ను తలపిస్తున్నాయి. ముఖ్యంగా యువతను, థియేటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ పాటను రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్లోనే ఈ పాటను విడుదల చేయడం సినిమాపై మేకర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. సాధారణంగా హిట్ అవుతుందని నమ్మకం ఉన్న పాటలనే ఇలాంటి పెద్ద వేదికలపై లాంచ్ చేస్తారు. ఆ దృష్ట్యా ‘హూక్స్టెప్’ సినిమా ప్రమోషన్లో కీలక పాత్ర పోషించనుంది.
స్టార్ కాస్ట్ & టెక్నికల్ టీమ్
‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల భారీ స్థాయిలో సినిమాను రూపొందించారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనుందని ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్, మాస్ క్యాచీ ట్యూన్స్‌లో భీమ్స్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హుక్‌స్టెప్ సాంగ్‌తో మరో చార్ట్‌బస్టర్ ఆయన ఖాతాలో చేరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్
దర్శకుడు అనిల్ రావిపూడి అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ ఫార్ములాను మరింత గ్రాండ్‌గా ప్రెజెంట్ చేసారనే విషయం మనకు తెలిసిన విషయం. హుక్‌స్టెప్ సాంగ్ అనేది కేవలం డాన్స్ నంబర్ కాదు… సినిమా మొత్తానికి మాస్ ఫీలింగ్‌ను సెట్ చేసే కీలక ఘట్టంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సంక్రాంతి బాక్సాఫీస్ టార్గెట్
జనవరి 12, 2026 – సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తే సమయం. అలాంటి టైమ్‌లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ లాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ రావడం సినిమాకు అదనపు అడ్వాంటేజ్.మేకర్స్ మొదటి నుంచి పర్ఫెక్ట్ ప్రమోషన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారని తాజా ప్రమోషన్స్ చూస్తే అర్ధం అవుతోంది.
ప్రేక్షకుల్లో అంచనాలు
హుక్‌స్టెప్ సాంగ్ లాంచ్ అప్డేట్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తున్నారు. “మాస్ బ్లాస్ట్ లోడింగ్”, “అనిల్ రవిపూడి మళ్లీ పండగే” అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ పాట స్టెప్ ట్రెండ్‌గా మారుతుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. సంక్రాంతి 2026 బాక్సాఫీస్ రేస్‌లో కీలకంగా మారింది.