Muram Reddy Venkateswarlu ( Mr. Venkat Reddy): ప్రతిభతో దూసుకుపోతున్న నట కెరటం Mr.venkat Reddy

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మొదలై.. బిల్డర్‌ గా…అక్కడి నుంచి నటుడిగా ఎదిగిన మూరం రెడ్డి వెంకటేశ్వర్లు. తెలుగు, కన్నడ చిత్రాల్లో తన వైవిధ్యభరిత నటనతో గుర్తింపు పొందారు మూరం రెడ్డి వెంకటేశ్వర్లు( Mr. వెంకట్ రెడ్డి ).

ఇప్పుడు తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుగు సినిమా గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సినిమాను కెరీర్ గా చేసుకుంటామని అంటే ఇంటా బయట బోలెడన్ని విమర్శలు. వద్దని వెనక్కి లాగేవాళ్లే. కానీ..ఇప్పుడు జనరేషన్ మారింది. యువత అభిరుచులు మారాయి. సాంకేతిక విద్యలో వచ్చిన కొత్త మార్పులతో సినిమా అనేది అగ్రస్థానంలో ఉంది.

అందుకే ఎప్పటి నుంచో సినిమాల్లోకి వెళ్ళి తమ ప్యాషన్ నెరవేర్చుకోవాలనే వాళ్ళు సైతం మళ్ళీ సినికళామతల్లి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు వచ్చి తన సత్తా చాటుతున్నారు.అలాంటి ప్రతిభావంతుడే మూరం రెడ్డి వెంకటేశ్వర్లు( Mr. వెంకట్ రెడ్డి).

కలలు అందరూ కంటారు.కానీ..ఆ కలలు సాకారం చేసుకునే దిశగా కొంతమంది అడుగులు వేస్తారు. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న నటులు Mr. వెంకట్ రెడ్డి.
అతని అడుగుల్లో ఆత్మవిశ్వాసం, నిబద్ధత, లక్ష్యం చేరుకోవాలనే దృఢ సంకల్పం వీటితో పాటు క్రమశిక్షణ అనే సద్గుణాలనే అస్త్రాలుగా చేసుకుని వెండితెరపై అలరిస్తున్న ప్రతిభ అతని సొంతం.

సినిమా అంటే చిన్ననాటి నుంచే మక్కువ. తెరపై నటులని చూసి తానే ఒక రోజు అలాంటి పాత్రల్లో కనిపించాలని కలగన్నాడు. ఆ కలను కళ్లముందు నిలబెట్టుకున్న వ్యక్తి — మూరం రెడ్డి వెంకటేశ్వర్లు, అందరికీ సుపరిచితుడైన పేరు Mr. వెంకట్ రెడ్డి.
తన జీవిత ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక కథలాంటిది. చిన్నప్పటి నుండి సినీ రంగంపై ఉన్న అభిరుచిని నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ఆయన వెనుతిరిగి చూడలేదు. అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ, తన ప్రతిభను నిరూపించుకునే ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

నటనలో కొత్తదనం

ప్రతి పాత్రలో కొత్తదనం చూపించడమే కాకుండా, పాత్ర పాత్రకు నటనలో పరిమితిని సాధించడమే లక్ష్యంగా వెంకట్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
ఆయన నటనలో సహజత్వం, భావప్రకటనలో గాఢత, మరియు పాత్రపట్ల అంకితభావం ప్రత్యేకంగా కనిపిస్తాయి.

లఘు చిత్రాల నుండి వెండితెరకు

వినాయకయ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెలుగు, కన్నడ భాషల్లో అనేక షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రయాణం ఆయనకు విశ్వాసాన్ని, గుర్తింపును తీసుకువచ్చింది.
ఇటీవల ఆయన నటించిన కన్నడ చిత్రం “The ICE” లో లీడ్ రోల్‌లో నటిస్తూ, తన ప్రతిభను పెద్ద తెరపై ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా, తెలుగు చిత్రం “తారకేశ్వరి” లో నెగటివ్ షేడ్ ఉన్న ప్రత్యేక పాత్ర ద్వారా తన నటనలో వైవిధ్యాన్ని చూపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి బిల్డర్‌… అక్కడి నుంచి నటుడిగా

వృత్తి పరంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా USA మరియు UK దేశాల్లో పనిచేసిన వెంకట్ రెడ్డి, ఆర్థికంగా స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ, తన మనసులో ఉన్న కళా తపనను విస్మరించలేకపోయారు. జీవితంలో ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఆయనను మళ్లీ తన కలల దారిలో నడిపించింది.
తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి, బెంగళూరులో బిల్డర్‌గా తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి, అనేక అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. కానీ తన అంతరంగంలో దాగిన నటుడు మళ్లీ పిలిచాడు — ఈసారి మాత్రం ఆయన ఆ పిలుపు వినిపించుకున్నారు. తన మనసులో నిద్రాణంగా దాగున్న సినిమా నటన పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటారు. అలా మొదలైంది తన సినీ ప్రయాణం.

సినిమా అంటే ప్రాణం” — వెంకట్ రెడ్డి

వెంకట్ రెడ్డి అభిప్రాయం ప్రకారం, “సినిమా అనేది కేవలం వినోదం కాదు, అది మనిషి భావాలను, అనుభూతులను వ్యక్తపరచే శక్తివంతమైన మాధ్యమం.”
ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రల్లో నటించడం తన తదుపరి లక్ష్యమని ఆయన చెబుతున్నారు. “నిజమైన నటుడు తన పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేయగలగాలి” అని ఆయన విశ్వసిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో అనేక ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని వినూత్న పాత్రల్లో ఆయనను ప్రేక్షకులు చూడబోతున్నారు.

విజయ చిత్ర ఫిల్మ్స్ పతాకంపై గుర్రపు విజయ్ కుమార్ నిర్మాతగా , రవణం సత్య కుమార్ సహ నిర్మాతగా, సంధ్యారాగం చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి డైరక్షన్ లో శ్రీలు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కంటెంట్ బేస్డ్ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న Mr.వెంకట్ రెడ్డి ఈ చిత్రంలో శశి పాత్రతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి దగ్గరవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కార్తీక పౌర్ణమి రోజున ఈ చిత్రం నుండి మేకర్స్ విడుదల చేసిన నా పాత్ర ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, ఈ చిత్రంలో శశి పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తానని అన్నారు. అతి త్వరలో షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళబోతోన్న ఈ మూవీకి అందరి ఆశీస్సులు కావాలని అన్నారు.

మూరం రెడ్డి వెంకటేశ్వర్లు – విజయప్రస్థానం సంక్షిప్తంగా

జన్మస్థలం: ఆంధ్రప్రదేశ్, నెల్లూరు

వృత్తి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా USA, UKలో సేవలు

వ్యాపారం: బెంగళూరులో నిర్మాణ రంగంలో స్వంత సంస్థ

సినీ ప్రయాణం: తెలుగు, కన్నడ షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు

ప్రస్తుత ప్రాజెక్టులు: “The ICE” (Kannada) – లీడ్ రోల్, “తారకేశ్వరి” (Telugu) – నెగటివ్ రోల్

ఎంచుకున్న రంగంలో ఎన్ని అడ్డంకులు ఎదురయినా మొక్కవోని ధైర్యంతో పది మందికి ఉపాధి కల్పిస్తూ తన సినీ మార్గానికి దారిని సుగమం చేసుకున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్డ్… బిల్డర్ టర్న్డ్ ..యాక్టర్ వెండితెరపై అద్భుత విజయాలు అందుకోవాలని, బిల్డర్ గా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుని ఇటు హీరోగా.. అటు బిల్డర్ గా కెరీర్ సమున్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటోంది పబ్లిక్ టాక్ టీవీ వెబ్సైట్ ( www.publictalktv.com)

One thought on “Muram Reddy Venkateswarlu ( Mr. Venkat Reddy): ప్రతిభతో దూసుకుపోతున్న నట కెరటం Mr.venkat Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *