చారిత్రాత్మక ఘట్టం: అమరావతికి చట్టబద్ధత.. బొబ్బిలి కోటలో దీపాలు వెలిగించి సంబరాలు చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన
బొబ్బిలి నియోజకవర్గం అమరావతి రాజధానిగా ప్రకటన బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బొబ్బిలి కోటలో సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు. బొబ్బిలి, ఏప్రిల్ 03, 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సర్వహక్కులు కల్పిస్తూ, పార్లమెంటులో ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026’ ఆమోదం పొందడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.బొబ్బిలి కోటలో వెలిగిన దీపాలు:ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…




