హైదరాబాద్,, పబ్లిక్ టాక్ టీవీ నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె *తేజస్విని నందమూరి* కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రొడక్షన్, మార్కెటింగ్ బాధ్యతల్లో చురుకుగా ఉన్న తేజస్విని, ఇప్పుడు ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ *‘సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్’* యాడ్‌లో హీరోయిన్‌గా మెరిశారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ యాడ్ షూట్‌లో ఆమె నేచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, సౌందర్యం ఆకట్టుకున్నాయని యాడ్ టీమ్ తెలిపింది. దర్శకుడు *వై. యమున కిషోర్*, కొరియోగ్రాఫర్ *బృందా మాస్టర్*, సంగీత దర్శకుడు *ఎస్.ఎస్. థమన్*, ఛాయాగ్రాహకుడు *అయాంకా బోస్* ఈ యాడ్‌కు ప్రత్యేక మెరుగులు చేర్చారు.
తేజస్విని భాగస్వామ్యంతో తమ బ్రాండ్ మరింత ప్రజాదరణ పొందుతోందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నందమూరి అభిమానులు ఆమె గ్లామర్, నేచురల్ చార్మ్‌ను ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం తేజస్విని ‘అఖండ 2’ సినిమాకు సహ నిర్మాతగా, అలాగే బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ లో ప్రొడక్షన్ ప్లానింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. యాడ్ ఫిల్మ్‌తో తేజస్విని తన సినీ ప్రయాణానికి నాంది పలికారని అభిమానులు చెబుతున్నారు.