తెలుగు సినీ పాటల పూదోటలో అక్షర సేద్యం చేస్తున్న కలం శ్రామికుడు — యువ ప్రతిభాశాలి విష్ణు
సినిమా సరస్వతీ పుత్రుల వేదిక— ప్రతి కళాకారుడి కలలకు ప్రాణం పోసే మాధ్యమం. ఈ వెండితెర విశ్వంలో అడుగుపెట్టిన ప్రతీ ప్రతిభావంతుడు తన కృషి, అంకితభావం, క్రమశిక్షణతోనే గుర్తింపు తెచ్చుకుంటాడు. అలా తెలుగు సినీ పాటల ప్రపంచంలో తన సాహిత్య సుగంధంతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న యువ సాహితీ శిల్పి విష్ణు జే.
సినిమా పాట అతని బాట. సాహిత్యమే అతని అక్షరాల పూదోట. పదాలతో సంగీతానికి పులకరింతలు తెచ్చే ఈ యువ లిరిక్స్ రైటర్, గత ఆరేళ్లుగా తెలుగు సినీ రంగంలో తన ప్రతిభను నిరూపించుకుంటూ “పాటల పూదోటలో అక్షర సేద్యం” చేస్తున్న కలం శ్రామికుడు. ప్రతి అవకాశాన్ని మహా అవకాశంగా మార్చుకుంటూ, సాహిత్యాన్ని తన ఆత్మగా మలచుకున్న నిత్య కృషివలుడు.తన కలాన్ని పరీక్షించుకుంటూ వచ్చిన విష్ణు, మంచి కంటెంట్ ఉన్న అనేక చిత్రాలకు సాహిత్యాన్ని అందించాడు. విష్ణుకు మొదటి అవకాశం తో తన ప్రతిభను చూపించుకున్న చిత్రాలు
ఈ సినిమాలన్నీ తనకు మంచి పేరు, గుర్తింపు తెస్తాయని విశ్వాసంగా చెబుతున్నాడు విష్ణు.
ప్రస్తుతం తాను పాటలు రాస్తున్న సినిమాలు
పరిణయం
కేతాగ్ని
కార్తీక్
కిస్మత్ వాలా
రేవు పార్టీ
యమకింకరుడు
జైత్రయాత్ర
లంకాపురంలో రావణ కాష్టం
అర్రర్ & క్రైమ్ (రెండు చిత్రాలు)
సూసైడ్ (OTT థ్రిల్లర్)
థ్రిల్లర్ మూవీస్ 2
ఈ చిత్రాల్లో రెండింటికీ విష్ణు సింగిల్ కార్డు రచయితగా పాటలు రాస్తుండటం ప్రత్యేకత.
ప్రేరణ, స్ఫూర్తి
“కేతాగ్ని” చిత్రానికి పాటలు రాసే అవకాశం తన కెరీర్‌లో మరచిపోలేని క్షణమని చెబుతున్నాడు విష్ణు. ఆ సినిమాలో లెజెండరీ లిరిక్స్ రైటర్ సుద్దాల అశోక్ తేజ గారు కూడా పాట రాయడం తెలుసుకున్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని అంటాడు. అలాంటి లబ్ధప్రతిష్ఠులైన రచయితతో ఒకే చిత్రంలో నా పాటలు ఉండటం నాకు జీవితాంతం స్ఫూర్తినిచ్చే విషయమని భావిస్తున్నాను,” అంటాడు విష్ణు జే.
జానర్ ఏదైనా – “జంక్షన్ జామ్” అవ్వాల్సిందే!
సెంటిమెంట్ కావొచ్చు, డ్యూయెట్ కావొచ్చు, ఐటెం సాంగ్ కావొచ్చు — ఏ జానర్‌లోనైనా రాయగల సత్తా ఉన్న విష్ణు ఎల్లప్పుడూ హైదరాబాదులోనే అందుబాటులో ఉంటూ, “పని అంటే దైవం” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. యూట్యూబ్ ఛానళ్లకు, పొలిటికల్ సాంగ్స్‌కి కూడా సాహిత్యాన్ని అందిస్తూ తన పరిధిని విస్తరించుకుంటున్నాడు.
సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, తన కలల దిశగా పటిష్టంగా నడుస్తున్నాడు ఈ యువ సాహితీ ముద్దుబిడ్డ. దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే, మరో శక్తివంతమైన పాటల రచయితగా విష్ణు జే పేరు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.