విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ ప్రేమ జంటగా నిలిచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా చివరికి తమ ప్రేమకథను సుఖాంతం చేసుకుని అధికారికం చేశారు. ఇద్దరి ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.
సినిమాల ద్వారా కలసిన ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా కలసి కొత్త ప్రయాణం మొదలుపెట్టడం అభిమానులకు హర్షం కలిగించింది. సోషల్ మీడియాలో ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూ, ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
“డియర్ కామ్రేడ్”, “గీతగోవిందం” సినిమాల నుంచే ఈ జంటపై ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా కలసి ఉండబోతున్నారన్న వార్త అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది.
సమీప బంధువులు, స్నేహితుల మధ్య సరదాగా సాగిన ఈ వేడుకలో విజయ్-రష్మిక జంట మరింత అందంగా, హృదయాన్ని హత్తుకునేలా మెరిసిపోయారు.
ఫ్యాన్స్, సినీ వర్గాలంతా వీరికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ #VijayRashmikaWedding హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు.
One thought on “Vijay – Rashmika Engagement :విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్”
Best couple 😊👌 Advance Happy married life Both of you 😊💐👏
Best couple 😊👌 Advance Happy married life Both of you 😊💐👏