తెలుగు సినిమాల్లో విజయదశమి సందడి…అమ్మవారి కరుణాకటాక్షాలు..రావణసంహారం సన్నివేశాలు, భక్తిరస విశేషాలతో మిమ్మల్ని అలరించేందుకు మీ ముందుకొచ్చింది పబ్లిక్ టాక్ టీవీ.కం (publictalktv.com).

తెలుగు సినిమాలో బాక్స్ ఆఫీస్ కనకవర్షానికి విజయ దశమి నేపథ్య కథలు , పాటలు చాలా దోహద పడ్డాయి. ఇలా…గ్రామదేవతగా, అమ్మోరుగా వచ్చి వెండితెరపై అవతరించి కాసుల వర్షం కురిపించిన చిత్రాల్లో మేటి చిత్రం అమ్మోరు చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ కథ సిద్ధం చేయగా సత్యానంద్ మాటలు రాశారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల ఈ చిత్రంలో పాటలు కూడా రాయడం విశేషం .1995లో విడుదలై ఘనవిజయం సాధించి..తెలుగులో వచ్చిన అమ్మోరు చిత్రాల్లో భారీ విజయం సాధించింది. “అమ్మోరు” చిత్రం తెలుగు సినీ చరిత్రలో దసరా సందడికి గుర్తుండిపోయే అద్భుతమైన చిత్రంగా నిలిచింది.
https://youtu.be/Rb0tATB39Tg?si=IqTKEb31c5ZUBDm3

కోటి 80 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన **అమ్మోరు** (1995) తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. మొదట నాగమణి, చిన్నా కీలక పాత్రల్లో నటించినా, రీషూట్ తర్వాత రామిరెడ్డి, వడివుక్కరసి ఆ పాత్రలను పోషించారు.సౌందర్యకు మొదట 40 వేల పారితోషికం మాత్రమే ఇచ్చినా, ఆమె నటనకు నిర్మాత అదనంగా ఇవ్వబోయిన ఒక లక్ష రూపాయలు స్వీకరించకుండా కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన **అమ్మోరు**,కమర్షియల్ సక్షస్ సాధించడమే కాకుండా అవార్డుల పరంగానూ రాణించింది. సౌందర్యకు **నంది & ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డులు**, సరితకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్, బేబీ సునయకు ఉత్తమ బాలనటి అవార్డులు వరించాయి. .భక్తి, హారర్ మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే క్లాసిక్‌గా నిలిచింది.

కనక దుర్గ అమ్మవారు నేపధ్యంలో వచ్చిన మరో చిత్రం దేవుళ్ళు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన భక్తి రసాత్మక చిత్రం లో రమ్య కృష్ణ అమ్మోరు పాత్రలో నటించి జన నీరాజనాలు అందుకుందిఈ చిత్రం లో పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించగా . వందేమాతరం శ్రీనివాస్ మ్యుజిక్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
ALSO READ: OG ప్రభంజనం…బాక్స్ ఆఫీస్ ప్రళయతాండవం!
దుర్గమ్మ భక్తి వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించిన మరో ప్రాముఖ్యమైన చిత్రం అమ్మా దుర్గమ్మ. 1996లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎ.ఎ. ఆర్ట్స్ పతాకంపై నిర్మించారుభక్తిరసంతో పాటు కుటుంబానుబంధాలను కలిపి తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించారు. శశికుమార్, ఊహ, రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ చిత్రానికి ప్రాణం పోసినది సంగీతమే. ఆ భక్తిరసాన్ని మరింతగా నింపుతూ వందేమాతరం శ్రీనివాస్ అందించిన గీతాలు ఆలయ వాతావరణాన్ని తలపింపజేశాయి.విజయదశమి సందర్భంలో దుర్గమ్మకు సమర్పణగా తెరకెక్కిన ఈ సినిమా, భక్తి-సినిమా మేళవింపుకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది,

అమ్మోరు తల్లి (మూకుత్తి అమ్మన్)
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార తొలిసారి అమ్మవారి పాత్రలో నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్, తెలుగులో అమ్మోరు తల్లిగా విడుదలైంది. ఈ చిత్రంతో RJ బాలాజీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లకు రాలేకపోయినా, దీపావళి సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో తమిళం, తెలుగులో విడుదలైంది.దొంగ బాబాల మోసాలను అరికట్టేందుకు అమ్మవారు స్వయంగా భూమికి దిగివచ్చే కథనంతో, భక్తి–కామెడీ మేళవింపుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నయనతార పోషించిన అమ్మవారి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది/
దసరా ఉత్సవాల శోభలో దుర్గమ్మ భక్తి తాండవం మధ్య, నటసింహం నందమూరి బాలకృష్ణ తెరపై ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా అలరించారు. అదే సినిమా – “లారీ డ్రైవర్”.ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా విజయశాంతి మెరిసి, సిల్వర్ స్క్రీన్‌పై ఒక అజరామరమైన కెమిస్ట్రీని సృష్టించారు. జయా ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. జయ రామారావు నిర్మాణం, రావు గోపాల్ రావు సమర్పణలో, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ కలిసిన ఈ చిత్రం అప్పట్లోనే కాక ఇప్పటికీ బ్లాక్‌బస్టర్ క్లాసిక్ గా నిలిచింది.బాలయ్య–విజయశాంతి జంట ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తే, చక్రవర్తి స్వరాలు రక్తం ఉప్పొంగించేలా చేశాయి. ముఖ్యంగా, “దసరా వచ్చిందమ్మ… సరదా తెచ్చిందమ్మ… జయహో దుర్గాభావానీ” పాట – అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రతి దసరా వేడుకల్లో మారుమ్రోగుతూనే ఉంది.బి. గోపాల్ స్టైల్ మాస్ మేకింగ్, బాలయ్య ఎనర్జీ, విజయశాంతి ఆకర్షణ—all together “లారీ డ్రైవర్” ను బాక్సాఫీస్ వద్ద అఖండ విజయవాహినిగా నిలిపాయి.

హీరోయిన్ రోజా ప్రధాన పాత్రలో దుర్గమ్మ గా భక్త జన నీరాజనాలు అందుకున్న చిత్రం అమ్మోరు తల్లి. ఈ చిత్రం లో గ్రాఫిక్స్ సహజంగా ఉండీ అందరినీ అలరిస్తాయి .మరి ..ఈ చిత్రం లోని అమ్మోరు మహిమలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Young టైగర్ ఎన్టీఆర్ త్రి పాత్రల్లో అలరించిన చిత్రం జై లవ కుశ, ఈ చిత్రంలో రావణ్ గా NTR అభినయం నభూతో నభవిష్యతి.బాబీ దర్సకత్వంలో వచ్చిన ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రాం నిర్మించారు.
విజయదశమి నేపద్యంలో ఏకంగా దసరా పేరుతోనే వచ్చిన నాని బ్లాక్ బస్టర్ మూవీ దసరా. విలన్లను మట్టికరిపించే సన్నివేశాలు దసరా ఉత్సవాల రోజున రావణ దహన సన్నివేశాలు ప్రేక్షకులకు ఘూస్ బంప్స్ తెప్పిస్తాయి. శ్రీకాంత్ ఓడెల దర్సకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా వచ్చిన దసరా మూవీ నానీ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది.
డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ వర్షం.శోభన్ డైరెక్షన్o వచ్చిన ఈ మూవీలో దసరా నేపధ్యంలో రావణ దహన సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈ సీన్ లో ప్రభాస్, త్రిషల నటన సినిమా సక్సెస్ లో కీలకంగా నిలిచింది.
ఇవండీ…విజయదశమి..మరియు దుర్గమ్మ నేపధ్యంలో వచ్చిన భక్తి రస చిత్రాలు..మరిన్ని ఇంటరెస్టింగ్ ఫిల్మ్ కాంటెంట్ కోసం పబ్లిక్ టాక్ టివి.కం ఫాలో అవండి.