Vision Studios: మీ సినిమా కళలకు సాంకేతిక వేదిక

మీ సినిమా కలని నిజం చేసుకోండి!
కెమెరా నుండి రిలీజ్ వరకు… Best Price – Best Quality తో!
100+ సినిమాలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ చేసిన ఘనమైన అనుభవం.
10+ సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులైన టెక్నీషియన్స్.
మా సేవలు:
కెమెరా రెంటల్స్: (Red, Sony, Blackmagic వంటి అగ్రశ్రేణి కెమెరాలు అందుబాటులో)
పోస్ట్ ప్రొడక్షన్: ఎడిటింగ్, డబ్బింగ్,Titles, సౌండ్ ఎఫెక్ట్స్, 5.1 మిక్సింగ్, DI, 5.1 Mixing.
అదనపు సేవలు: DCP మాస్టరింగ్, Lyrical Videos, Subtitles, Promotions, Release.

విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ అన్నవేన గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం

తెలుగు సినీ పరిశ్రమకు అంకితభావంతో సేవలందిస్తున్న విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ అన్నవేన గారికి మరో గౌరవం లభించింది.హైదరాబాద్ దసపల్లా హోటల్ లో జరిగిన విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా
అతిరథ మహారధుల సమక్షంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనను ఘనంగా సత్కరించింది.
గత 11ఏళ్లుగా 100కి పైగా చిన్న చిత్రాలకు పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందిస్తూ, థియేటర్స్ లో ఆయా చిత్రాల విడుదల వరకు నిర్మాతలకు మద్దతుగా నిలుస్తూ సినీ రంగానికి అపూర్వమైన సహకారం అందించినందుకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనను సత్కరించింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు హాజరవగా విశిష్ట అతిధులుగా తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్పర్సన్ డా. గుమ్మడి వి.వెన్నెల గద్దర్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్ లయన్ సాయి వెంకట్ గారు, నటుడు-దర్శకుడు నాగబాల సురేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు డా. చింతపట్ల వెంకటాచారి గారు, జ్యూరీ & చీఫ్ కోఆర్డినేటర్ డా. టీవీ. అశోక్ కుమార్ గారు కలిసి ముఖ్య అతిధుల సమక్షంలో రమేష్ అన్నవేన గారికి ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. రమేష్ గారు చిన్న చిత్రాలకు సాంకేతికంగా అండగా నిలిచి ఎందరో చిన్న నిర్మాతలకు మార్గదర్శకుడిగా నిలిచారని అతిధులు కొనియాడారు.
అనంతరం విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఐకాన్ఫ్ అఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.సినీ రంగం తో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి ఈ అవార్డులను ప్రధానం చేశారు.
ఆశయానికి శ్రమ తోడైతే అద్భుతవిజయాలు సాధించవచ్చని యువతరానికి ఐకాన్ గా నిలిచారు.
అంతే కాకుండ ఫిల్మ్ ఇండస్ట్రీ లో శతాధిక చిత్రాలను నిర్మించిన ఘనులకు సముచితమైన రీతిలో గౌరవిస్తూ అవార్డులతో సత్కరించడం మామూలు మాటలు కాదు.
చిన్న చిత్రాలకు వెన్నుదన్నుగా నిలవడం,
వెండితెరకు కొత్తవారిని పరిచయం చేయాలన్న సంకల్పంతో యువ ప్రతిభను గుర్తించి పురస్కారాలు ప్రధానం చేసి ప్రోత్సహించడం
విజన్ స్టూడియోస్ రమేష్ అన్నవేన గారి పెద్ద మనసును చాటుతోంది. పరిశ్రమ మనుగడకు దొహద పడుతూ, విజన్ సినిమాటిక్ అకాడమీ ద్వారా అతి తక్కువ ఫీజుతో యువతరానికి శిక్షణ ఇస్తూ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు రమేష్ గారు కళా సేవాభావంతో సాగిపోతున్న ఈ అభిమన్యుడు, నిజమైన మార్గదర్శిగా నిలుస్తున్నాడు.
విజన్ స్టూడియోస్ రమేష్ అన్నవేన గారు ఓ ఆశయ నాయకుడు మాత్రమే కాదు, పరిశ్రమలోకి ఆశలు నింపుతూ వెళ్తున్న మార్గదర్శకుడు కూడా.
కొత్తవారికి అవకాశాలు కల్పించే సంకల్పంతో యువ ప్రతిభను గుర్తించి వారికి ఐకాన్ ఆఫ్ ఎక్సెలెన్స్ అవార్డ్స్ పురస్కారాలు అందించడం అంటే ఎంతటి పెద్ద మనసు ఉండాలి. ఇవన్నీ ఒక్క వ్యక్తిలో ఉండటం సాధారణ విషయం కాదు.ఇన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ అన్నవేన గారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం ప్రధానం చేసి సముచిత స్థానాన్ని కల్పించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అభినందనీయులు.

విజన్ స్టూడియోస్ G26, మధురా నగర్, యూసుఫ్‌గూడ మెయిన్ రోడ్, హైదరాబాద్-45 +91 8500123245

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *