తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహంలో మెగాస్టార్.. నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరంజీవి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.

నేడు జరిగిన ఈ ఘనమైన వివాహ వేడుకకు హాజరైన చిరంజీవి, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో చిరంజీవి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తన బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి ఈ వేడుకకు రావడం పట్ల భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *