సినిమా, మీడియా , డిజిటల్, అడ్వర్టైజింగ్
రంగాలలో 30ఏళ్ల అనుభవం ఉన్న శ్రీనివాస్ నేదునూరి
ETv, NTV, RTV, Prime 9 News లలో కంటెంట్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ ( RFC) చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో సంధ్యారాగం సినిమాకు రచన, దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సూత్రధారి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ అడ్వర్టైజింగ్ రంగంలో కూడా యాక్టీవ్ గా ఉన్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.
నేడు జరిగిన ఈ ఘనమైన వివాహ వేడుకకు హాజరైన చిరంజీవి, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో చిరంజీవి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తన బిజీ షెడ్యూల్లోనూ సమయం కేటాయించి ఈ వేడుకకు రావడం పట్ల భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు.