అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన

బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 08-03-2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మెప్మా, వెలుగు, హెల్త్ డిపార్టుమెంటు సిబ్బందితో ఈరోజు కళాభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ముఖ్యఅతిథిగా హాజరయి, పలువురు మహిళలను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలది ఎంతో కీలకపాత్ర అని, దేశ అభ్యున్నతిలో మహిళలు భాగస్వాములుగా ఉండి ప్రగతి వైపు నడిపిస్తున్నారని అన్నారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్ర మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని, ప్రతి ఇంటినుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారుచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం, వివిధ విభాగాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు గారు, బొబ్బిలి నియోజకవర్గ స్పెషల్ అధికారి నూకరాజు గారు, ఎంపీడీవో రవి కుమార్ గారు, పట్టణ సిఐ కె.నారాయణరావు గారు, నంబియార్ వేణుగోపాలరావు గారు, తదితరులు పాల్గొన్నారు.

(PRO, MLA BBL)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *